ప్రభాస్ పై కర్చీప్ వేసిన అమరన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నాడో చెప్పాల్సిన పనిలేదు. చేతిలో ఉన్న కమిట్ మెంట్లు పూర్తి చేయడానికే మూడు నాలుగేళ్లు సమయం పడుతుంది.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నాడో చెప్పాల్సిన పనిలేదు. చేతిలో ఉన్న కమిట్ మెంట్లు పూర్తి చేయడానికే మూడు నాలుగేళ్లు సమయం పడుతుంది. అయినా డార్లింగ్ కొత్త కథలు వినడంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఖాళీ సమయంలో కథలు వినడం ...నచ్చిన వాటిని ఒకే చేయడం పనిగా చేస్తున్నారు. తాజాగా 'అమరన్' దర్శకుడు రాజ్ కుమార్ పెరియా స్వామి ఓ భారీ యాక్షన్ స్టోరీ చెప్పాడట. ఇదీ 'అమరన్' తరహాలో ఉండే ఓ ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అట. లైన్ నచ్చడంతో డార్లింగ్ ఒకే చెప్పారట.
మళ్లీ పూర్తి స్క్రిప్ట్ తో అప్రోచ్ అవ్వమని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి యూవీ క్రియేషన్స్ కూడా ఆసక్తిగా ఉందని సమాచారం. అయితే ఈ సినిమా తీయడానికి మాత్రం మూడే ళ్లపైన సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రభాస్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. 'రాజా సాబ్' షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అలాగే 'పౌజీ' చిత్రం కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నుంచి 'కల్కి 2' మొదలవుతుంది. ఈ సినిమాతో పాటే `పౌజీ `షూటింగ్ కూడా జరుగుతుంది.
అప్పటికీ 'పౌజీ' చిత్రీకరణ ఓ దశకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో 'కల్కి 2' కిలైన్ క్లియర్ అవుతుంది. కల్కి మొదలైతే? ఆ సినిమా పూర్తయ్యే వరకూ మరో కొత్త సినిమా పట్టాలెక్కదు. పూర్తిగా ఆ ప్రాజెక్ట్ పైనే పనిచేస్తారు. కల్కి అనంతరం 'స్పిరిట్' పట్టాలెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ మరో సినిమాకు హాజరవ్వడానికి వీలు లేదు. ఇదీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కండీషన్. ఆ ప్రకారమే ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఈ సినిమా అనంతరం `సలార్ 2` మొదలవుతుంది.
ఇవన్నీ పూర్తవ్వడానికి ఎలా లేదన్నా? మూడేళ్లకు పైగా సమయం పడుతుంది. మరి తమిళ దర్శకుడిని అంతవరకూ హెల్డ్ లో పెడతారా? మధ్యలో ఇంకేరకమైనా సర్దుబాటు చేస్తారా? అన్నది చూడాలి. అదే జరిగితే ఈ గ్యాప్ లో పెరియా స్వామి మరో రెండు సినిమాలు చేసుకుని రావొచ్చు. `అమరన్` హిట్ తర్వాత పెరియాస్వామి ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించని సంగతి తెలిసిందే.