ఆ స్టేట్ లో... ప్రభాస్, రజినీనే టాప్!
పాన్ ఇండియా స్టార్ హీరోలు ప్రభాస్, రజినీకాంత్ గురించి అందరికీ తెలిసిందే. రజినీ సీనియర్ అయినప్పటికీ... ప్రభాస్ జూనియర్.;
పాన్ ఇండియా స్టార్ హీరోలు ప్రభాస్, రజినీకాంత్ గురించి అందరికీ తెలిసిందే. రజినీ సీనియర్ అయినప్పటికీ... ప్రభాస్ జూనియర్. పాన్ ఇండియా వైడ్ గా ఇద్దరికీ వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వారి సినిమాల కోసం ఎప్పుడూ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
అయితే కొంతకాలంగా ప్రభాస్, రజినీ కాంత్ నటించిన సినిమాలు.. అన్ని లాంగ్వేజెస్ లో విడుదల అవుతున్నాయి. కర్ణాటకలో కూడా సాలిడ్ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అక్కడి సినీ ప్రియులు.. వారి సినిమాలు మంచిగా ఆదరిస్తూనే ఉన్నారు. థియేటర్స్ లో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు కర్ణాటకలో వారిద్దరూ ఓ లిస్ట్ లో టాప్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకు ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ఆరు సినిమాలు.. కన్నడ సినీ మార్కెట్ లో రూ.20 కోట్లకు పైగా వసూలు చేశాయని తెలుస్తోంది.. పాన్ ఇండియా హీరోల్లో ఆ మార్క్ ను సొంతం చేసుకున్న నటుడు ఇప్పటివరకు ప్రభాస్ మాత్రమేనట. ఇప్పుడు రజినీకాంత్ కూడా ఆ మార్క్ అందుకున్నారని వినికిడి. మన డార్లింగ్ సరసన చేరి.. ఆయనతో సమం అయ్యారని టాక్.
తన రీసెంట్ మూవీ కూలీతో ఆ మార్క్ ను రజినీకాంత్ సొంతం చేసుకున్నారని ఇప్పుడు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఆ సినిమా.. ఇప్పుడు కర్ణాటకలో రూ.20 కోట్లు సాధించినట్లు సమాచారం. దీంతో కన్నడ మార్కెట్ లో 20 కోట్లు వసూలు చేసిన ఆరు సినిమాలు ఉన్న పాన్ ఇండియా హీరోలుగా ప్రభాస్, రజినీకాంత్ లు మాత్రమే నిలిచారని తెలుస్తోంది.
వారి దగ్గరలో మరే ఇతర హీరోలు కూడా లేరని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే రజినీ, ప్రభాస్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీయనున్నారన్న విషయం తెలిసిందే. ప్రభాస్ లైనప్ లో బోలెడు సినిమాలు ఉన్నాయి. తలైవా కూడా పలు ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు. దీంతో కన్నడ మార్కెట్ లో తమ నంబర్ ను మరింతగా పెంచుకుంటారేమో వేచి చూడాలి.