తెలుగు Vs తమిళ్.. ఫ్యాన్స్ వార్ తప్పదా?
అక్కడి హీరోలు నటించే సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ తో పాటు ఇక్కడ మన హీరోలు యాక్ట్ చేసే సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే చాలు.. ఫ్యాన్స్ మధ్య నెట్టింట మాటల యుద్ధం పక్కానే!;
టాలీవుడ్, కోలీవుడ్ మూవీ లవర్స్ మధ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్స్ జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే. అక్కడి హీరోలు నటించే సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ తో పాటు ఇక్కడ మన హీరోలు యాక్ట్ చేసే సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే చాలు.. ఫ్యాన్స్ మధ్య నెట్టింట మాటల యుద్ధం పక్కానే!
ఇప్పుడు అదే మరోసారి జరిగేలా ఉంది. ఎందుకంటే వచ్చే ఏడాది సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి జన నాయగన్ సినిమాలు థియేటర్స్ లో విడుదల కానున్నాయి. రీసెంట్ గా రాజా సాబ్ మూవీ జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.
అదే సమయంలో జనవరి 9నే జన నాయగన్ మూవీ కూడా విడుదల కానుంది. దీంతో ఇప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ తప్పదనేలా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు సినిమాలు భారీగా విడుదల అవ్వనుండగా.. అభిమానుల సోషల్ మీడియాలో రివ్యూలు, పోస్టులతో పోటీపడడం తప్పదనే చెప్పాలి.
అయితే రాజా సాబ్ మూవీ.. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా.. త్వరలో ప్రమోషన్స్ ను ఫుల్ జోష్ తో స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.
ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ తో సాలిడ్ బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. మరోవైపు, జన నాయగన్ విజయ్ కు చివరి మూవీగా ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల క్రితం పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.
దీంతో జన నాయగన్ మూవీ తర్వాత మరి విజయ్ సినిమాలు చేయరని అంతా అనుకుంటున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ చిత్రానికి హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఆ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ రాగా, మంచి అంచనాలు నెలకొన్నాయి.
అలా రెండు సినిమాలపై ఆయా హీరోల ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయని ఫిక్స్ అయ్యారు. ఆయా చిత్రాల అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా మాత్రం జన నాయగన్, రాజా సాబ్ రిలీజ్ లతో తెలుగు, తమిళ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగేలా ఉంది.