• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వంద కోట్ల క్లబ్బులో రాజా...

వంద కోట్ల క్లబ్బులో రాజా సాబ్.. టాప్ లిస్ట్ ఇదే..

| బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్కును టచ్ చేయడం అంటే ఒకప్పుడు అది పెద్ద గగనం.

By - M Prashanth
Update: 2026-01-10 09:42 GMT

బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్కును టచ్ చేయడం అంటే ఒకప్పుడు అది పెద్ద గగనం. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా పెరిగాక, మొదటి రోజే ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' కూడా ఈ ఎలైట్ క్లబ్బులో చేరిపోయింది. సినిమాపై మిక్స్డ్ టాక్ నడుస్తున్నా, వసూళ్ల విషయంలో మాత్రం ప్రభాస్ తన సత్తా చాటుతున్నాడు. మేకర్స్ అధికారికంగా వంద కోట్ల పోస్టర్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ లెక్కలపై పెద్ద చర్చ నడుస్తోంది.




 


నిజానికి రాజా సాబ్ కి వచ్చిన టాక్ చూస్తే ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు వస్తాయని చాలా మంది ఊహించలేదు. సెకండ్ హాఫ్ లో సాగదీత ఉన్నా, డార్లింగ్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు సంక్రాంతి సెలవులు కలిసి రావడం ఈ వసూళ్లకు ప్రధాన కారణం. గతంలో బాహుబలి 2, సాహో వంటి సినిమాలతో ప్రభాస్ ఈ ఫీట్ ను చాలాసార్లు అందుకున్నాడు. ఇప్పుడు రాజా సాబ్ తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నాడు.

తెలుగు సినిమాలే కాకుండా కోలీవుడ్ నుంచి విజయ్ నటించిన లియో, గోట్ వంటి చిత్రాలు కూడా ఫస్ట్ డే వంద కోట్ల మార్కును దాటాయి. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు రాజా సాబ్ కూడా ఆ సినిమాల సరసన చేరినట్లు మేకర్స్ చెబుతున్నారు. మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ వంద కోట్ల లెక్కలు చూస్తుంటే, టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతోంది.

పుష్ప 2, దేవర, కల్కి 2898 ఏడీ వంటి రీసెంట్ సెన్సేషన్స్ కూడా మొదటి రోజు సెంచరీ కొట్టేశాయి. రాజా సాబ్ విషయంలో హారర్ కామెడీ జోనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వసూళ్లు లాంగ్ రన్ లో ఎంతవరకు నిలకడగా ఉంటాయనేదే ఇప్పుడు అసలైన పాయింట్. కేవలం ప్రభాస్ క్రేజ్ తోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా.

మొదటి రోజు రికార్డులు బాగున్నా, రాబోయే రోజుల్లో ఇతర పెద్ద సినిమాలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. రాజా సాబ్ బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడు రసవత్తరంగా మారింది. మిక్స్డ్ టాక్ ను దాటుకుని ఈ సినిమా తన జోరును ఎలా కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పటివరకు మొదటి రోజే వంద కోట్ల వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాను ఒకసారి గమనిస్తే..

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ సినిమాలు

బాహుబలి 2

సాహో

ఆర్ఆర్ఆర్

కేజీఎఫ్ 2

పఠాన్

ఆదిపురుష్

జవాన్

లియో

యానిమల్

సలార్

కల్కి 2898 ఏడీ

గోట్

దేవర

పుష్ప 2

ఓజీ

కూలీ

ది రాజా సాబ్

Tags:    
  • therajasaabcollections 
  • prabhas 
  • maruthi 
  • tollywood 
  • boxoffice 
  • rrr 
  • pushpa2 
  • baahubali 
  • devara 
  • rajasaab 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS