ది రాజాసాబ్ పార్ట్ 2.. జోకర్ గెటప్ లో ప్రభాస్!
బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.;
బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే చివరిగా కల్కి 2898 ఏడితో ఏకంగా వెయ్యికోట్ల క్లబ్లో చేరిన ప్రభాస్.. ఇప్పుడు ది రాజాసాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పైగా ప్రభాస్ కెరియర్ లో తొలి హారర్ కామెడీ మూవీ కావడంతో సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి కూడా నెలకొంది.
ఇదిలా ఉండగా ఇందులో మాళవిక మోహనన్ , నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ తోపాటు మరో ఐదు మంది హీరోయిన్లు ఇందులో నటించడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుందా? లేక ప్రీక్వెల్ గా తిరిగి తెరకెక్కిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా పార్ట్-2 టైటిల్ ని "రాజాసాబ్ సర్కస్: 1935" గా ఖరారు చేసినట్లు క్లైమాక్స్ లో తెలిపారు.
పైగా ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్లతో పాటు ప్రభాస్ ఓల్డ్ ఏజ్ లుక్ సన్నివేశాలు కూడా పార్ట్ 1 లో కనిపించలేదు. ఇవన్నీ కూడా పార్ట్ 2 లో ఉంటాయేమో చూడాలి.. ఇకపోతే ప్రభాస్ ఇందులో జోకర్ పాత్రలో కనిపించబోతున్నట్లు క్లైమాక్స్ లోని ఆయన లుక్ రివీల్ చేశారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ ను మెప్పించడానికి భిన్నవిభిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరొకవైపు ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి తొలిసారి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది ఈ చిత్రం ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఇటీవల ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రాలతో పాటు సలార్ 2, కల్కి 2898AD సీక్వెల్స్ ను కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా పూర్తవ్వాలంటే మరో మూడేళ్లు పడుతుంది అనడంలో సందేహం లేదు.