సంక్రాంతి కాదు.. రెబల్స్ కి దసరా ఫీస్ట్ కూడా..?

ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఆరెఫ్సీ లో మరో షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను 2026 దసరా బరిలో రిలీజ్ చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి.;

Update: 2025-10-10 05:34 GMT

2026 పొంగల్ రేసులో దిగే సినిమాలు దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. ఒకటి రెండు సినిమాలు కాదు ఈసారి ఏకంగా అరడజను సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. అన్ని సినిమాలు ఎలా ఉన్నా రెబల్ ఫ్యాన్స్ కి అయితే ప్రభాస్ రాజా సాబ్ ట్రీట్ ఇవ్వబోతుందని ఫిక్స్ అయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేశారు. సినిమాను థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా అటెంప్ట్ చేస్తూనే మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ కూడా ఉండేలా చూస్తున్నారు. ప్రభాస్ ని బాలీవుడ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడు సీరియస్ రోల్స్ మాత్రమే చేస్తున్నాడని అంటున్నారు. అక్కడ వారి కోసమే ప్రభాస్ రాజా సాబ్ లో ఒక మంచి ఎంటర్టైనింగ్ రోల్ చేస్తున్నాడు.

ప్రభాస్ సినిమాలైతే వరుసగా కమిట్ అవుతున్నాడు కానీ..

అసలైతే ఈ సినిమా ఈ ఇయర్ డిసెంబర్ కి రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే సంక్రాంతికి ప్రభాస్ సినిమా వస్తుంది అంటే మరో సినిమా మరో ఏడాది అవుతుందా అనే డౌట్ ఫ్యాన్స్ కి రాక మానదు. ప్రభాస్ సినిమాలైతే వరుసగా కమిట్ అవుతున్నాడు కానీ వాటిని పూర్తి చేయడానికి మాత్రం అనుకున్న టైం ఇవ్వలేకపోతున్నాడు. ఐతే అది ప్రభాస్ మిస్టేక్ అని చెప్పలేం కూడా. ఐతే ప్రభాస్ రాజా సాబ్ పూర్తి చేయగా సెట్స్ మీద హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ ఉంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఫౌజీ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్, ఇమాన్వి ఈ జోడీ స్క్రీన్ మీద అదిరిపోతుందని అంటున్నారు. అసలే ఫౌజీ సినిమా పీరియాడికల్ అటెంప్ట్ గా వస్తుంది. బిఫోర్ ఇండిపెండెన్స్ స్టోరీతో ఈ సినిమా కథ రాసుకునాడట హను రాఘవపూడి. ఐతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైందట. నెక్స్ట్ యూరప్ లో మేజర్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ తో షూటింగ్ మాక్సిమం పూర్తవుతుందట.

హను రాఘవపూడి ప్రభాస్ తో మరో క్రేజీ స్టోరీతో..

ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఆరెఫ్సీ లో మరో షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను 2026 దసరా బరిలో రిలీజ్ చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. కుదిరితే ఆగష్టు లేదా అక్టోబర్ లో దసరాకి ఫౌజీని రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట. సీతారామం హిట్ తర్వాత హను రాఘవపూడి ప్రభాస్ తో మరో క్రేజీ స్టోరీతో వస్తున్నారని తెలుస్తుంది.

ఫౌజీ సినిమాలో ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ కి స్పెషల్ ఫీస్ట్ అందిస్తాయని అంటున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ ఐతే రెబల్ ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News