ప్రభాస్.. ఇంతకంటే ఏం కావాలి!

అయితే తాజాగా బాహుబలి రీయూనియన్ సందర్భంగా కనిపించిన ప్రభాస్ లుక్ మాత్రం ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది.;

Update: 2025-07-11 07:00 GMT

పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ క్రేజ్‌ రోజు రోజుకీ పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ కలిగిన ఈ రెబల్ స్టార్‌ సినిమా ఎంపికలో హై లెవెల్ ను చూపిస్తూనే.. ప్రతిసారి కొత్తగా ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫేమ్ మరో లెవెల్‌కి వెళ్లినా.. సినిమాల రిజల్ట్, లుక్స్ విషయంలో మాత్రం కొంత విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు అతడి తాజా లుక్ చూసిన అభిమానులు "ఇదే మన ప్రభాస్" అంటూ సంబరపడిపోతున్నారు.

వరుసగా సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల్లో ప్రభాస్ లుక్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో “ప్రభాస్ మొహంలో ఓల్డ్ ఛామ్ కనిపించట్లేదు”, “వెయిట్ మించినట్టుంది” అంటూ ట్రోల్స్ కూడా చోటుచేసుకున్నాయి. ఈ లోపు సలార్ సినిమాలో మాత్రం కాస్త మెరుగైన రెస్పాన్స్ వచ్చి ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయినా పర్ఫెక్ట్ స్టైల్, చక్కని హెయిర్‌కట్, క్లీన్ షేవ్ లాంటి లుక్స్ చూసే భాగ్యం దక్కలేదు.

అయితే తాజాగా బాహుబలి రీయూనియన్ సందర్భంగా కనిపించిన ప్రభాస్ లుక్ మాత్రం ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది. షేవ్ చేసిన గడ్డం, స్టైలిష్ హెయిర్‌తో కనిపించిన ప్రభాస్‌.. " మన మిర్చి డేస్ ప్రభాస్" అంటూ కామెంట్లు తెచ్చుకున్నాడు. ఇక ట్రెండింగ్‌లో ఉన్న ఈ లుక్‌ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఫ్యాన్స్‌కు ఇది ఓ సర్‌ప్రైజ్‌లా మారింది.

ఈ లుక్‌ ప్రస్తుత ఫౌజీ సినిమాలో ప్రభాస్ చేస్తున్న పాత్ర కోసమేనన్న టాక్ వినిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన లుక్‌కి తగినట్లుగానే ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. హను తన సినిమాల్లో హీరోలను చాలా స్టైలిష్‌గా, అందంగా చూపించే విషయంలో స్పెషలిస్టే. ఆయన గత సినిమాల్లోనూ అదే కనిపించింది.

ఇక రాజాసాబ్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఒక పాట, కొన్ని సీన్లు మినహాయిస్తే షూటింగ్ పూర్తి చేసినట్టు సమాచారం. ఆ తర్వాత వంగా దర్శకత్వంలో రూపొందే స్పిరిట్‌ కోసం గడ్డం లుక్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఫౌజీ లుక్‌లో కనిపించిన ప్రభాస్‌ని చూసి “ఈ లుక్‌ను కంటిన్యూ చేయాలి” అనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది. మొత్తానికి ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్.. “ఇంతకంటే బెటర్ లుక్ మేమేమీ కోరం” అంటూ కామెంట్లు పెడుతున్నారు. గత ట్రోల్స్‌కి పూర్తిగా బదులిచ్చేలా ప్రభాస్ లుక్ మారిందన్న ఫీల్‌తో అభిమానులు ఆనందంగా ఉన్నారు.

Tags:    

Similar News