'కల్కి కర్ణుడి సీన్.. చివరి క్షణాల్లో చూసేస్తాం'

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.;

Update: 2025-08-26 07:39 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ మూవీ స్థాయిని మరో రేంజ్ కు తీసుకెళ్లిందని చెప్పాలి. మహాభారతం నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఆ సినిమా.. దాదాపు రూ.1000 కోట్ల చేరువలోకి వెళ్లింది.

సినిమాలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, ఉత్తర ఇలా చాలా క్యారెక్టర్స్ ను చూపించారు నాగ్ అశ్విన్. అనేక మంది స్టార్ నటీనటులను రంగంలోకి దించారు. అయితే సినిమా చివర్లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అర్జునుడికి, అశ్వత్థామకి యుద్ధం జరుగుతుండగా కర్ణుడిగా ప్రభాస్ ఎంట్రీ ఇస్తారు.

అర్జునుడిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అశ్వత్థామగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేశారు. మొత్తానికి ప్రభాస్, విజయ్, అమితాబ్ ఉన్న సీన్ అయితే వేరే లెవెల్ లో సినీ ప్రియులను మెప్పించింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక కూడా తెగ అలరించింది. కొద్ది రోజుల క్రితం ఆ సీన్ ను నెట్ ఫ్లిక్స్ పోస్ట్ చేసింది.

పవర్ ఫుల్ సూర్యపుత్ర కర్ణగా ప్రభాస్ అంటూ యూట్యూబ్ లో షేర్ చేసింది. లక్షల్లో వ్యూస్ వచ్చిన ఆ సీన్ ను హైప్ ఇస్తూ.. రీసెంట్ గా నెట్ ప్లిక్స్ ఇండియా పెట్టిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. మీరు ఇంకా రెండు నిమిషాల 15 సెకన్లు మాత్రం జీవిస్తారని డాక్టర్ చెప్పగా.. సూర్యపుత్ర ప్రభాస్ కర్ణ వీడియో చూస్తామనేలా తాజాగా పోస్ట్ పెట్టింది.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. ఆ సీన్ లో కర్ణుడిగా ప్రభాస్ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. చెప్పాలంటే.. గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెబుతున్నారు. ఎన్నిసార్లు చూసినా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందని, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఇంకా హైప్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

ఆ సీన్ విషయానికొస్తే.. అర్జునుడు, అశ్వత్థామ మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు అశ్వత్థామపై అస్త్రం ప్రయోగిస్తాడు అర్జునుడు. అప్పుడే ఓ యోధుడి బాణం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ఢీకొడుతుంది. దీంతో అర్జునుడి రథం వెనక్కి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అర్జునుడు ప్రయోగించిన బాణంతో ఆ యోధుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లిపోతుంది. ఆ సమయంలో సూర్యపుత్ర వికర్తన కర్ణ అనే డైలాగ్ వస్తుండగా.. ప్రభాస్ ఎంట్రీ ఇస్తారు. కాగా, కల్కి సీక్వెల్ లో కర్ణుడు పాత్ర కీలకమని తెలుస్తోంది.

Tags:    

Similar News