కన్నప్ప.. ప్రభాస్ ఎంతసేపు కనిపిస్తారు?

ప్రభాస్ రుద్ర పాత్ర.. కన్నప్ప సెకండాఫ్ లో ఉంటుందని బీవీఎస్ రవి తెలిపారు. ఇంటర్వెల్ అయ్యాక 15 నిమిషాల తర్వాత డార్లింగ్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు.;

Update: 2025-06-22 20:30 GMT

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యే ఉంది. అందులో ఒక కారణం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండడం కూడా. సినిమాలో రుద్రగా ప్రభాస్ కనిపించనున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. ఆ సమయంలో విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. తనకు ప్రభాస్ కృష్ణుడు అయితే.. తాను మాత్రం ప్రభాస్‌ కు కర్ణుడినని చెప్పారు. అంతకుముందు ప్రభాస్ రుద్ర రోల్ కు సంబంధించిన పాటను సంగీత దర్శకుడు స్టీఫెన్‌ పెర్ఫామ్ చేశారు. వేడుకకు వచ్చిన వారందరినీ ఆకట్టుకున్నారు.

అయితే ప్రభాస్ పాత్రపై మంచి ఆసక్తి ఉండగా.. ఇప్పుడు ఆయన రోల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? ఎంత సేపు స్క్రీన్ పై కనిపించనున్నారు? అన్న ప్రశ్నలు తెలుగు సినీ ప్రియులందరి మదిలో ఉన్నాయి. వాటిపై రచయిత బీవీఎస్ రవి.. రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. సినిమాకు ఎలివేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ప్రభాస్ రుద్ర పాత్ర.. కన్నప్ప సెకండాఫ్ లో ఉంటుందని బీవీఎస్ రవి తెలిపారు. ఇంటర్వెల్ అయ్యాక 15 నిమిషాల తర్వాత డార్లింగ్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని అంచనాలు పెంచారు. ఓవరాల్ గా సెకండాఫ్ అదిరిపోతుందని చెప్పారు. ప్రభాస్ స్క్రీన్ టైమ్ 20 నిమిషాలు ఉంటుందని వెల్లడించారు.

ప్ర‌భాస్, విష్ణు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు అద్భుతంగా ఉంటాయ‌ని రైటర్ చెప్పారు. కన్పప్ప.. చ‌రిత్ర సృష్టించే సినిమా అవుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. మోహ‌న్ బాబు చేసిన రోల్, ఆయన యాక్టింగ్ గొప్పగా ఉంటాయని కొనియాడారు. విష్ణు ఎంతో క‌మిట్మెంట్ ఉన్న న‌టుడుగా వర్ణించారు. కన్న‌ప్ప కోసం ప్రాణం పెట్టి న‌టించారని చెప్పారు.

కన్నప్ప డబ్బింగ్ విషయంలో విష్ణు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. ప్రతి ఒక్క డైలాగ్ కూడా క్లియర్ గా చెప్పారని.. తప్పు లేకుండా చెప్పారని అన్నారు. ఏదేమైనా తన కష్టానికి తగ్గ ఫలితాన్ని కన్పప్ప మూవీతో కచ్చితంగా అందుకుంటారని తెలిపారు. సినిమా వేరే లెవెల్ హిట్ అవ్వడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం బీవీఎస్ రవి వ్యాఖ్యలతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

Tags:    

Similar News