• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ లుక్.. ఇలా...

ప్రభాస్ లుక్.. ఇలా చేశారేంటి?

| బ్లాక్ బస్టర్ హిట్ సలార్ సీక్వెల్ కూడా మొదలైనట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు.

By - Tupaki Desk
Update: 2024-11-09 07:22 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవల సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అనేక రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు భారీ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ పనుల్లో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడితో చేస్తున్న మూవీ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది.

బ్లాక్ బస్టర్ హిట్ సలార్ సీక్వెల్ కూడా మొదలైనట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు.అదే సమయంలో ప్రభాస్ కు సంబంధించిన లుక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తున్నారు. అందులో ప్రభాస్ నుదిటిపై విభూతితో కనిపిస్తున్నారు. మెడలో రుద్రాక్ష మాలలు ఉన్నాయి. దీంతో అది ఏ మూవీ నుంచి లీక్ అయిన పిక్ అని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.

కన్నప్ప సినిమాలోని ప్రభాస్ లుక్ అని అంతా చెబుతున్నారు. అయితే మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీలో అనేక మంది బిగ్ స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా క్యామియో రోల్ పోషిస్తున్నారు. నందీశ్వరుడిగా నటిస్తున్నట్టు సమాచారం. కానీ ఇప్పటి వరకు కన్నప్ప మేకర్స్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయలేదు. ఇప్పటికే రిలీజైన టీజర్ లో కూడా ప్రభాస్ కళ్ల వరకే చూపించారు.

దీంతో ఇప్పుడు ప్రభాస్ లుక్ లీక్ అయింది! సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు బాగుందంటే.. ఇంకొందరు ఇలా లుక్ ను లీక్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తుంటే.. లీక్ అవ్వడం బాధగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అసలు ఎలా లీక్ అవుతున్నాయో తెలియడం లేదని, మేకర్స్ ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కామెంట్లు పెడుతున్నారు.

అయితే ప్రభాస్ కన్నప్ప మూవీకి గాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మంచు మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా గెస్ట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపించింది. ప్రభాస్ ఎంత చిన్న రోల్ చేసినా అది సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరి కన్నప్ప మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Kalki2898ad 
  • Rajasaab 
  • Maruti 
  • Fauji 
  • Hanuraghavapudi 
  • Spirit 
  • Sandeepreddyvanga 
  • Kannappa 
  • Manchuvishnu 
  • Prabhas 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS