ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ పై క్రేజీ న్యూస్!
పాన్ ఇండియా స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయారు.
పాన్ ఇండియా స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఆయన కెరియర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో చేసిన చిత్రం ది రాజా సాబ్. సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక దీంతో ప్రభాస్ ఈ జానెర్ లో సెట్ కారు అనే కామెంట్లు కొంతమంది నెటిజెన్స్ నుంచి వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి చిత్రాలపై సినీ లవర్స్ దృష్టి పడిందనే చెప్పాలి.
ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకటి సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ కాగా.. మరొకటి సీతారామం సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి పీరియడ్ డ్రామాగా.. భారతదేశ స్వాతంత్ర్య సమయంలో జరిగిన అల్లకల్లోల నేపథ్యంలో తిరుగుబాటుదారుడిగా మారిన ఒక బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడి కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 14 లేదా 15వ తేదీలలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ సినిమాను పర్ఫెక్ట్ గా తెరకెక్కించడానికి , వీఎఫ్ఎక్స్ లో ఎటువంటి లోపం లేకుండా చిత్రాన్ని తెరకెక్కించడానికి కాస్త సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ చెక్కర్లు కొడుతోంది.
ఫౌజీ చిత్రాన్ని 2026 డిసెంబర్ 3న విడుదల చేయాలనే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే కొన్ని వారాల్లోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే పాటలు, పాత్రల పరిచయ వీడియోలతో పాటు మెల్లగా ప్రమోషన్స్ ని కూడా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇక త్వరలోనే ప్రభాస్ ఇంటర్వ్యూల రూపంలో ఆడియన్స్ ముందుకి వస్తారని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
ఫౌజీ సినిమా విషయానికి వస్తే హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మిథున్ చక్రవర్తి అనుపమ్ కేర్, జయప్రద తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్రం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.