ఫౌజీపై రెండు మార్కెట్ల గేమ్.. అదే బిగ్ ప్లస్ పాయింట్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీపై అంచనాలు పెరుగుతున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ కు.. హను కథ చెప్పే విధానం తోడవుతుండటంతో ఆ ప్రాజెక్టుపై ఫుల్ హైప్ నెలకొంది. ముఖ్యంగా సినిమాకు రెండు వేర్వేరు మార్కెట్లను ఒకేసారి టార్గెట్ చేసే అవకాశం ఉండటం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్రభాస్ స్టార్ డమ్.. మరోవైపు హను సినిమాలపై ఉన్న ప్రత్యేక గుర్తింపు.. ఫౌజీకి బిగ్ ప్లస్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్ లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి తర్వాత ఆయన సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. దీంతో కథ ఏ ప్రాంతానికి చెందినదైనా.. ప్రభాస్ సినిమా అనే కారణంతో అన్ని చోట్ల హైప్ ఏర్పడుతోంది. ఫౌజీ విషయంలోనూ ఇదే మెయిన్ స్ట్రెంత్ కానుంది. ఇక హను రాఘవపూడి సినిమాలకు మరో స్పెషాలిటీ ఉంది.
కథలో యాక్షన్ ఉన్నప్పటికీ.. పాత్రల మధ్య ఎమోషన్, ప్రేమ, డ్రామాకు ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సీతారామంతో ఆయన కథన శైలికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా ఎఫెక్ట్ కూడా ఫౌజీపై అంచనాలు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రభాస్ లాంటి భారీ స్టార్ తో హను ఎలాంటి కథను చెబుతారన్న ఆసక్తి అందరిలో ఉంది.
ఇక్కడే ఫౌజీకి అసలు గేమ్ మొదలవుతుంది. సాధారణంగా స్టార్ హీరో సినిమాలకు యాక్షన్, భారీ సీన్స్ అట్రాక్షన్ గా ఉంటాయి. కానీ హను రాఘవపూడి మార్క్ కథనం వల్ల ఫౌజీలో ఎమోషనల్ కంటెంట్ కూడా కీలకంగా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రభాస్ ను యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా.. ఒక పాత్ర చుట్టూ తిరిగే కథలో భాగంగా చూపించే ఛాన్స్ ఉంది. ఇది తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ మార్కెట్ లోనూ ఎక్స్ ట్రా అసెట్ గా మారింది.
మరోవైపు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కూడా సినిమాకు ప్రత్యేకత తీసుకురానుంది. స్వాతంత్ర్యానికి ముందు కాలం బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో అప్పటి పరిస్థితులు, పాత్రల జీవితం, దేశభక్తి అంశాలు కథలో కీలకంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆ బ్యాక్ డ్రాప్ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలు ఉండటం ఎంత ప్లస్ పాయింటో.. అంతే పెద్ద బాధ్యత కూడా.
ప్రభాస్ స్టార్ ఇమేజ్ కు తగ్గ రేంజ్ కంటెంట్ తోపాటు కథనంతో ప్రేక్షకులను మెప్పించాలి. అలా ఫౌజీకి ప్రభాస్ మార్కెట్ ఒక బలం అయితే.. హను రాఘవపూడి కథ చెప్పే విధానం మరో బలం. ఆ రెండు కలిసి పనిచేస్తే సినిమా ఒక్క భాషకే పరిమితం కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల్ని చేరుకునే ఛాన్స్ ఉంది. మరి డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా ఆడియన్స్ తోపాటు సినీ ప్రియుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.