జెట్ స్పీడ్‌లో ప్రజెట్ స్పీడ్‌లో ప్రభాస్ లైనప్ - హను రాఘవపూడితో మరో క్రేజీ ప్రాజెక్ట్!

ఈ సినిమా సెట్స్‌లో దర్శకుడు హను రాఘవపూడి వర్కింగ్ స్టైల్, టేకింగ్ విధానం ప్రభాస్‌కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది.

Update: 2026-08-21 18:30 GMT

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్‌లతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఒకవైపు గ్లోబల్ ప్రాజెక్ట్‌లు చేస్తూనే.. మరోవైపు యువ దర్శకులతో ప్రయోగాత్మక చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ షెడ్యూల్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరనుందనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ప్రభాస్ న‌టిస్తోన్న `ఫౌజీ` షూటింగ్ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమా సెట్స్‌లో దర్శకుడు హను రాఘవపూడి వర్కింగ్ స్టైల్, టేకింగ్ విధానం ప్రభాస్‌కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కథలోని డెప్త్, ఎమోషనల్ కంటెంట్ ప్రభాస్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయట‌. ఈ నేపథ్యంలోనే హను రాఘవపూడి చెప్పిన మరో సరికొత్త కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్ద‌రి కాంబినేషన్‌లో వస్తోన్న `ఫౌజీ` అనుకున్న దానికంటే అద్భుతంగా రావ‌డంతో? రిపీట్ కొలాబరేషన్‌కు తీస్తున్న‌ట్లు సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన హోంబలే ఫిలిమ్స్ - మైత్రి మూవీ మేకర్స్ సంస్థల్లో ఏదో ఒకటి నిర్మించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఈ ప్రొడక్షన్ హౌస్‌లతో ప్రభాస్‌కు మంచి అనుబంధం ఉండటంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు ప్రభాస్ ఖాతాలో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న `కల్కి 2`, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ `స్పిరిట్`.. అలాగే ప్రశాంత్ నీల్ తో `సలార్ 2` వంటి భారీ చిత్రాలు క్యూలో ఉన్నాయి.

ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్యలోనూ మరో కొత్త సినిమాకు డార్లింగ్ డేట్స్ కేటాయించడం ప్ర‌భాస్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్న రెబల్ స్టార్ వేగం చూస్తుంటే రాబోయే రెండు.. మూడేళ్ల‌లో బాక్సాఫీస్ రికార్డులన్నీ డార్లింగ్ పేరిట ఖాయమనిపిస్తోంది. వరుస పాన్-ఇండియా చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తున్నారు. ప్ర‌భాస్ తో పాటు బ‌న్నీ కూడా అదే రేంజ్ లో కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇదే త‌ర‌హాలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, మ‌హేష్ కూడా భ‌విష్య‌త్ ప్రాజెక్ట్ ల‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే వారంతా కూడా త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు

భాస్ లైనప్ - హను రాఘవపూడితో మరో క్రేజీ ప్రాజెక్ట్!

Tags:    

Similar News