'మార్కో' దర్శకుడితో ఇండియా బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్
అతడు లోకల్ మార్కెట్ ని అధిగమించి ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించడంతో ఎంపికల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు.
డార్లింగ్ ప్రభాస్ గత కొన్నేళ్లుగా అలుపెరగని షెడ్యూళ్లతో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు లోకల్ మార్కెట్ ని అధిగమించి ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించడంతో ఎంపికల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. అతడు కొలతల ప్రకారం ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. ఇండియా గ్రేటెస్ట్ డైరెక్టర్లు రాజమౌళి, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి వారితో సినిమాలు చేసాడుప్రభాస్.
ప్రస్తుతం ఫౌజి, స్పిరిట్, కల్కి 2898 ఏడి 2, సలార్ 2 వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో అతడు బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ ఎంపిక చేసుకున్న దర్శకుల జాబితాలో మార్కో ఫేం హనీష్ అదేని పేరు వినిపించడం నిజంగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మార్కో చిత్రంలో తన హీరోని అత్యంత క్రూరుడిగా ఆవిష్కరించిన హనీఫ్ ఇప్పుడు ప్రభాస్ ని కూడా అదే విధంగా చూపిస్తాడా? అంటూ చాలా మంది సోషల్ మీడియాల్లో ప్రశ్నిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు- మార్కో ఫేం హనీఫ్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ చిత్రం పట్టాలెక్కబోతోందనే సమాచారంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. దిల్ రాజు వేసిన మాస్టర్ ప్లాన్ మేరకు హనీఫ్ వినిపించిన పవర్‌ఫుల్ రా అండ్ రస్టిక్ యాక్షన్ లైన్‌కు ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించారని కథనాలొస్తున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌లో నిర్మించేందుకు మైండ్ బ్లోయింగ్ ప్లాన్ సిద్ధమవుతోందని కథనాలొస్తున్నాయి.
అయితే, ఈ క్రేజీ కాంబోను వెండితెరపై చూడాలంటే అభిమానులు చాలా కాలం వేచి చూడక తప్పదు. ప్రభాస్ మరో రెండేళ్ల పాటు (2027- 28) అంగీకరించిన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో పూర్తిగా బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి `ఫౌజీ`తో పాటు `కల్కి 2898 ఏడి` సీక్వెల్, `సలార్ 2` వంటి భారీ చిత్రాలు ప్రభాస్ లైనప్‌లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి కనీసం మరో రెండేళ్లకు పైగానే సమయం పడుతుంది.
ప్రభాస్ చిత్రాల విడుదల వివరాల్లోకి వెళ్తే... సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ కాప్ డ్రామా `స్పిరిట్` చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ తేదీని అధికారికంగా ఖరారు చేశారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన నాగ్ అశ్విన్ `కల్కి 2898 ఏడి` సీక్వెల్ (పార్ట్ 2)ను 2027 డిసెంబర్ నాటికి థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ భారీ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతే హనీఫ్ అదేని- దిల్ రాజు ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రశాంత్ నీల్ `సలార్ 2`తో పాటు ఇతర కమిట్‌మెంట్లు ముగిసేసరికి 2028 ఎండింగ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన `మార్కో` దర్శకుడితో ప్రభాస్ మూవీ షూటింగ్.. రిలీజ్ 2029 వరకూ పాజిబుల్ కాదని విశ్లేషిస్తున్నారు.
అయినా.. దిల్ రాజు బ్యానర్‌లో హనీఫ్ అదేని విజన్.. ప్రభాస్ మాస్ అప్పీల్ కలిసి వస్తే అది కాసుల పంట పండిస్తుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. `మార్కో` వంటి కల్ట్ యాక్షన్ మూవీ మేకింగ్‌తో సౌత్ ఇండియా దృష్టిని ఆకర్షించిన హనీఫ్ డార్లింగ్ ప్రభాస్‌ను ఏ రేంజ్ రా అండ్ రస్టిక్ అవతార్‌లో చూపిస్తారోనని రెబెల్ స్టార్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్, కల్కి, ఫౌజి కంటే విభిన్నమైన కాన్సెప్టును హనీష్ తో ప్రభాస్ ట్రై చేస్తాడని కూడా అంచనా వేస్తున్నారు. 2028 వరకూ ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాకపోవచ్చని భావిస్తున్నారు.