ఆమె నైజం నుంచి నేర్చుకోవాల్సినది ఉంది: ఆనంద్ దేవరకొండ
థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల అలవాటు మళ్లీ పుంజుకోవడం పరిశ్రమకు ఎంతో శుభపరిణామమని అతడు అభిప్రాయపడ్డారు. వరుసగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు రావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందని తెలిపారు.
ఇటీవల నటుడు ఆనంద్ దేవరకొండ సినీ పరిశ్రమ వర్తమాన పరిస్థితి గురించి అలాగే తన కుటుంబ విషయలపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల అలవాటు మళ్లీ పుంజుకోవడం పరిశ్రమకు ఎంతో శుభపరిణామమని అతడు అభిప్రాయపడ్డారు. వరుసగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు రావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందని తెలిపారు.
విశ్వనాథ్ అండ్ సన్స్, చెన్నై లవ్ స్టోరీ, ఇరుముడి వంటి రకరకాల జానర్ సినిమాలు వరుసగా థియేటర్లలోకి వచ్చి విజయం సాధించడంపై అతడు సంతోషం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాలు రావడం పరిశ్రమ ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. వారంతాల్లో ఏ కొత్త సినిమా వస్తుందో అని ప్రేక్షకులు యాప్‌లలో చెక్ చేసుకునే స్థాయికి వాతావరణం మారడం ఆశావహ పరిణామమని చెప్పారు.
ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందిస్తే తప్పకుండా థియేటర్లకు వస్తారని ప్రూవైందని అన్నారు. గతంలో కొన్ని నెలల పాటు సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని.. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. ఈ తరహా సానుకూల మార్పు సినీ పరిశ్రమ భవిష్యత్తుకు ఎంతో కీలకమని ఆనంద్ పేర్కొన్నారు.
ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. తన అన్న విజయ్ దేవరకొండ భార్య రష్మిక (రుషి) గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన కంటే చిన్నది కావడంతో తాను వదినను ఆప్యాయంగా `రుషి` అని పిలుస్తానని తెలిపారు. వదినమ్మకు షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చాక సినిమాల గురించి లేదా పని గురించి మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండదని వెల్లడించారు.
తాను, విజయ్ .. తమ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు పనికి సంబంధించిన విషయాలు కొంతైనా చర్చిస్తామని.. కానీ రష్మిక మాత్రం ఇంటికి రాగానే పనిని పూర్తిగా మరిచిపోయి ప్రశాంతంగా ఉంటుందని ఆనంద్ తెలిపారు. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ.. వృత్తిపరమైన జీవితాన్ని.. వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా ఉంచే రుషి నైజం నుంచి తాము నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆనంద్ వ్యాఖ్యానించారు. ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఇది ఒక విభిన్నమైన చిత్రమని కూడా ఆనంద్ వెల్లడించారు.