4 యుగాలను కవర్ చేసిన ఏకైక పాన్ ఇండియా హీరో!

సాధారణంగా కల్ట్ క్లాసిక్ మొదలుకొని మాస్, యాక్షన్ , ఫిక్షన్ వరకు ఎన్నో చిత్రాలు తెరపై సందడి చేశాయి. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే కాకుండా నిజాలను తెరపై చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Update: 2026-06-03 11:30 GMT

సాధారణంగా కల్ట్ క్లాసిక్ మొదలుకొని మాస్, యాక్షన్ , ఫిక్షన్ వరకు ఎన్నో చిత్రాలు తెరపై సందడి చేశాయి. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే కాకుండా నిజాలను తెరపై చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మన సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో దర్శకులు పడిన కష్టాలు వర్ణనాతీతం. ఇకపోతే హీరోలు కూడా ప్రేక్షకుడి అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక చిత్రాలను మొదలుకొని కామెడీ, హారర్ ,రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఇలా ప్రతి జానర్ లో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఇక ప్రత్యేకించి డివోషనల్ జానర్ విషయానికి వస్తే.. రాముడిగా, రావణాసురుడిగా, కృష్ణుడిగా, కంసుడిగా ఇలా ఎన్నో రూపాలలో ప్రేక్షకులను అలరించిన పాత్రల గురించి తెలిసిందే. అయితే వీరంతా ఒక యుగం లేదా రెండు యుగాలలోని పాత్రలతో ప్రేక్షకులను అలరించిన వారే. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఏకంగా నాలుగు యుగాలను కవర్ చేస్తూ నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఆయన ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ఒకవైపు తన సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ఇతర హీరోల సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఈయన రొమాంటిక్ మొదలుకొని హారర్, కామెడీ , మాస్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ ఇలా ఒక్కటేమిటి అన్ని జానర్ లను టచ్ చేస్తూ.. ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి ప్రభాస్ ఏకంగా నాలుగు యుగాలను కవర్ చేస్తూ సినిమాలు చేశారని మీకు తెలుసా ? ముఖ్యంగా ఆయన పాత్రలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఆయన కవర్ చేసిన ఆ నాలుగు యుగాలు ఏంటి ? వాటిలో ఆయన పాత్రలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

సత్యయుగంలో రుద్రుడిగా..

మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీగా వచ్చిన కన్నప్ప సినిమాలో రుద్రుడిగా ప్రభాస్ కనిపించారు.శివుడి పరమ భక్తుడిగా 30 నిమిషాల పాటు ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఇక సత్యయుగం నాటి పాత్రతో మెరిసిపోయారు ప్రభాస్.

త్రేతాయుగంలో రాముడిగా..

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. త్రేతాయుగం నాటి రామాయణ ఇతిహాస గాథను తెరపై చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ వల్ల పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇందులో రాముడిగా ప్రభాస్ పాత్ర ఆకట్టుకున్నారు.ఆ అవతారంతో ఆయనలోని కొత్త యాంగిల్ ను చూపించారు.

ద్వాపరయుగంలో కర్ణుడిగా..

ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD చిత్రంలో భైరవ (మహాభారత కాలానికి చెందిన పురాణ యోధుడు) పాత్రలో కనిపించి సందడి చేశారు. ఈ పాత్ర భైరవుడి పూర్వజన్మగా కనిపిస్తుంది. సినిమా ప్రథమార్ధంలో భైరవుడి పాత్రలో చాలా చలాకీగా, కామెడీగా, స్వార్థం మేళవింపుగా సాగుతుంది. కానీ సెకండాఫ్ అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి భైరవుడిలోని అసలు శక్తి ఏంటో తెలిసి.. కథ మలుపు తిరుగుతుంది. అలా ఈ సినిమా చివరిలో కర్ణుడిగా కనిపించారు. ఇక ఈయన పూర్తి రోల్ మనకు సెకండ్ భాగంలో కనిపించనున్నట్లు సమాచారం.

కలియుగంలో బాహుబలిగా..

ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్నది కలియుగం. ఈ కలియుగంలో ప్రభాస్ బాహుబలి పాత్రతో అదరగొట్టేశారు. అంతేకాదు ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించి ప్రేక్షకులను మెప్పించారు.

అలా ప్రస్తుత జనరేషన్లో ఈ నాలుగు యుగాలను కవర్ చేసిన ఏకైక హీరోగా..ఈ రికార్డు ప్రభాస్ కి మాత్రమే సాధ్యమని చెప్పవచ్చు. ప్రభాస్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే హారర్ కామెడీ జానర్ లో సినిమా చేసి ప్రేక్షకులను నిరాశపరిచారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల తర్వాత కల్కి సీక్వెల్ తో పాటు సలార్ సీక్వెల్ లో ప్రభాస్ నటించనున్నారు.

Tags:    

Similar News