టాలీవుడ్ బాక్సాఫీస్‌పై దేశభక్తి జెండా!

కొంత కాలంగా టాలీవుడ్ సరికొత్త ప్రయోగాలకు, ట్రెండ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, మాస్ మసాలా కథలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ మేకర్స్ ఇప్పుడు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు.

Update: 2026-06-11 01:30 GMT

కొంత కాలంగా టాలీవుడ్ సరికొత్త ప్రయోగాలకు, ట్రెండ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, మాస్ మసాలా కథలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ మేకర్స్ ఇప్పుడు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కాంబినేష‌న్స్ దేశభక్తి అనే బలమైన సెంటిమెంట్‌ను ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నారు. అప్ క‌మింగ్ భారీ బడ్జెట్ చిత్రాలలో దేశభక్తి నేపథ్యమే అత్యంత కీలకమైన కథాంశంగా మారబోతోందని తెలుస్తోంది.

ఈ సరికొత్త ట్రెండ్‌లో ముందు వరుసలో నిలుస్తున్నారు గ్లోబల్ స్టార్ ప్రభాస్. ఆయన కథానాయకుడిగా న‌టిస్తోన్న‌ చిత్రం `ఫౌజీ` విప్లవం, యుద్ధం , దేశభక్తి వంటి అంశాల నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథగా రూపుదిద్దుకుంటోంది.

ప్రభాస్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నటుడు దేశభక్తి .. విప్లవాత్మక కథలో నటిస్తుండటంతో ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఇదే దేశభక్తి బాటలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పవర్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ న‌టిస్తోన్న‌ చిత్రం `డ్రాగన్` కూడా దేశభక్తి పూరిత స్పై యాక్షన్ సాగాగా తెరకెక్కుతుంద‌ని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రం పక్కా దేశభక్తి కథాంశంతో సాగనుంది. నీల్ మార్క్ ఇంటెన్స్ మేకింగ్‌కు ఎన్టీఆర్ నటన తోడైతే వెండితెరపై ఓ విజువల్ వండర్ క్రియేట్ అవ్వడం ఖాయం. దీంతో తార‌క్, ప్ర‌భాస్ పేర్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

అలాగే మరో ప్రముఖ స్టార్ హీరో కూడా హై-ఇంటెన్సిటీ దేశభక్తి చిత్రానికి సిద్ధమవుతున్నారు. భారతీయ గూఢచార సంస్థ రా నిర్వహించిన రహస్య ఆపరేషన్లు ..వాస్తవ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందని తెలిసింది. నిజ జీవిత ఘట్టాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ దేశ రక్షణ కోసం పోరాడే ఒక యోధుడి పాత్రలో ఆ స్టార్ హీరో క‌నిపిస్తాడ‌న్న‌ది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రి ఉన్నట్లుండి టాలీవుడ్ మేకర్స్ దేశభక్తి కథలపై మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే? పాన్-ఇండియా మార్కెట్ విస్తరణే అని చెప్పొచ్చు. భాషా భేదాలు లేకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న భారతీయ ప్రేక్షకులందరినీ ఏకం చేయగల ఏకైక సెంటిమెంట్ దేశభక్తి. రాబోయే భారీ బడ్జెట్ టాలీవుడ్ చిత్రాలలో దేశభక్తి అత్యంత బలమైన కథాంశాలలో ఒకటిగా మారుతుండటానికి ఈ మార్కెట్ సమీకరణాలే ప్రధాన కారణం. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి ఈ తరహా జాతీయవాద కథాంశాలు అత్యంత సులువైన మార్గంగా మారాయి.

ఏదేమైనా రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుండి విడుద‌ల‌య్యే పెద్ద సినిమాలన్నీ దేశం కోసం ప్రాణాలర్పించే వీరుల కథలను, గూఢచార వ్యూహాలను , విప్లవాత్మక పోరాటాలను ఆవిష్కరించబోతున్నాయన్న‌ది కాద‌న‌లేని నిజం. భారీ బడ్జెట్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అగ్ర తారల నటన కలగలిసి రాబోయే దేశభక్తి చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు ఎక్కించనున్నాయి. తెలుగు హీరోలు వెండితెరపై దేశభక్తి జెండాను ఎంత ఎత్తులో ఎగరేస్తారో? చూడటానికి ప్రేక్షకులు సైతం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News