ఫౌజీ.. ఎందుకు ఈ గందరగోళం?

అంతే కాకుండా స్పిరిట్‌ కోసం బల్క్‌ డేట్లు ఇస్తానంటూ హామీ ఇచ్చిన ప్రభాస్‌ అన్నట్లుగానే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యేంత వరకు మరే షూటింగ్‌ కు హాజరు అయ్యే పరిస్థితి కనపడటం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Update: 2026-07-04 05:35 GMT

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'ఫౌజీ' సినిమా విషయంలో అభిమానుల్లోనే కాకుండా అందరిలోనూ గందరగోళం నెలకొంది. మొదట ఈ సినిమాను దర్శకుడు ఎక్కువ లేట్‌ లేకుండా స్పీడ్‌గా షూటింగ్‌ చేసి విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సినిమా ఇదే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ ఏడాది చివరి వరకు అయినా సినిమా వచ్చే అవకాశం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ఈ మధ్య కాలంలో ఫౌజీ షూటింగ్ కంటే ఎక్కువగా ప్రభాస్‌ స్పిరిట్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అంతే కాకుండా స్పిరిట్‌ కోసం బల్క్‌ డేట్లు ఇస్తానంటూ హామీ ఇచ్చిన ప్రభాస్‌ అన్నట్లుగానే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యేంత వరకు మరే షూటింగ్‌ కు హాజరు అయ్యే పరిస్థితి కనపడటం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో...

స్పిరిట్‌ సినిమాను దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసే విధంగా షూటింగ్‌ ప్లాన్‌ చేశాడట. అంటే ఈ ఏడాది చివరి వరకు స్పిరిట్‌ షూటింగ్‌తోనే ప్రభాస్ బిజీగా ఉంటాడని తెలుస్తోంది. ఫౌజీ సినిమా షూటింగ్‌ ఇంకా చాలానే పెండ్డింగ్‌లో ఉందనే వార్తలు వస్తున్నాయి. కనీసం రెండు నెలల షూటింగ్‌ బాకీ ఉందని ఆఫ్‌ ది రికార్డ్‌ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే విడుదల చేయాలంటే స్పిరిట్‌ సినిమాను పక్కన పెట్టి ప్రభాస్‌ ఫౌజీ షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ప్రభాస్‌ ప్రస్తుతానికి పూర్తిగా స్పిరిట్‌ పై ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రభాస్‌ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫౌజీ, స్పిరిట్‌ సమాంతరంగా చేయాలని ప్రభాస్‌ అనుకుంటున్నాడని, కానీ స్పిరిట్‌కు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందట.

ప్రభాస్‌ ఫౌజీ సినిమా రిలీజ్ విషయమై...

ఫౌజీ సినిమాను ప్రముఖ ఓటీటీ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌, హను రాఘవపూడి గత చిత్రాల అనుభవం నేపథ్యంలో ఈ సినిమాకు భారీ మొత్తంలో పెట్టి మరీ ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఓటీటీ డీల్‌ జరిగే సమయంలోనే విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఫౌజీ సినిమాను 2026 డిసెంబర్‌లో విడుదల చేస్తామని ఓటీటీ డీల్‌ కుదుర్చుకున్నారట. 2027 సంక్రాంతికి ఓటీటీలో ఫౌజీ స్ట్రీమింగ్‌ చేసే విధంగా ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. కానీ ఇప్పుడు ఓటీటీ డీల్‌ సైతం బ్రేక్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమా విడుదల కాకుంటే సదరు ఓటీటీ డీల్‌ విషయంలో నిర్మాతలతో పునః సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఓటీటీ మార్కెట్‌ తగ్గినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మైత్రి మూవీస్ బ్యానర్‌లో హను రాఘవపూడి..

సీతారామం వంటి బిగ్గెస్ట్‌ క్లాసిక్ బ్లాక్‌ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఫౌజీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ప్రభాస్ హీరో కావడంతో ఆ అంచనాలు పీక్స్‌కు చేరాయి. అందుకే ఫౌజీ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు, అన్ని వర్గాల వారు వెయిట్‌ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల ఓపెనింగ్స్‌ను కచ్చితంగా ఫౌజీ బ్రేక్‌ చేస్తుందనే విశ్వాసంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సోషల్‌ మీడియా ఇన్ఫ్యూలెన్సర్‌ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్‌కు జోడీగా ఈమె భలే సెట్‌ అయ్యిందంటూ యూనిట్‌ సభ్యులు లీక్‌ లు ఇస్తున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమా స్టార్‌ కాస్ట్‌, టెక్నీషియన్స్ చూస్తే ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అనే ఆసక్తి పెరుగుతుంది. కానీ రిలీజ్ విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతూనే ఉంది. దర్శకుడు హను ఈ గందరగోళంకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. మైత్రి వారి నుంచి ఎప్పటి వరకు ఫౌజీ విషయంలో స్పష్టత వస్తుందో చూడాలి.

Tags:    

Similar News