లెనిన్ గ్యాప్.. రెండింటిలో ఏ మూవీకి ప్లస్ అవుతుందో..

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అఖిల్ లుక్, యాక్షన్, ఎమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.

Update: 2026-07-04 06:48 GMT

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ విడుదలకు సిద్ధమవుతోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథకు పీరియాడిక్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ తెరకెక్కిన ఆ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అఖిల్ లుక్, యాక్షన్, ఎమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.

అయితే లెనిన్ విడుదలకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఇదే ఇప్పుడు థియేటర్లలో ఉన్న రెండు కొత్త సినిమాలకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ వారం భారీ అంచనాల మధ్య విడుదలైన నాగబంధం, రావు బహుదూర్ చిత్రాలకు ప్రేక్షకులను ఆకర్షించుకునేందుకు మంచి అవకాశం దక్కింది. ఆ గ్యాప్‌ ను ఏ సినిమా బాగా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

నాగబంధం విషయానికి వస్తే.. విజువల్సే ప్రధాన బలమని ప్రేక్షకుల అభిప్రాయం. దర్శకుడిగా అభిషేక్ నామా చేసిన ప్రయత్నం, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ క్వాలిటీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొన్ని సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే కథ మాత్రం పూర్తిగా కొత్తగా అనిపించకపోయినా, విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమాను ఆస్వాదించే ప్రేక్షకులకు నచ్చినట్లు కనిపిస్తోంది.

మరోవైపు రావు బహుదూర్ పూర్తిగా భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు వెంకటేష్ మహా తనదైన శైలిలో కథను చెప్పే ప్రయత్నం చేశారు. సత్యదేవ్ యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. డిఫరెంట్ కాన్సెప్ట్, స్ట్రాంగ్ రోల్స్, టెక్నికల్ క్వాలిటీ సినిమాక ప్రశంసలు తీసుకొచ్చాయి. అయితే స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం కొందరికి మైనస్‌ గా అనిపించినా, కంటెంట్‌ ఇష్టపడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది.

ఇప్పుడు ఆ రెండు సినిమాలకు కలిసి వస్తున్న ప్రధాన అంశం లెనిన్ విడుదలకు ఉన్న వారం గ్యాప్. ఈ మధ్యలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో థియేటర్లలో ప్రేక్షకుల దృష్టి నాగబంధం, రావు బహుదూర్ పైనే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే థియేటర్లలో ఉన్న పాత సినిమాలను ఎక్కువ మంది చూసేయడంతో, కొత్తగా చూడాలనుకునే వారికి ఆ రెండు చిత్రాలే ప్రధాన ఎంపికగా మారనున్నాయి. అయితే ఆ అవకాశాన్ని ఏ సినిమా బాగా ఉపయోగించుకుంటుందన్నది మౌత్ టాక్‌ పైనే ఆధారపడి ఉంటుంది.

నాగబంధం విజువల్స్‌ తో ఫ్యామిలీ ఆడియన్స్‌ ను , భారీ కాన్వాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. మరోవైపు రావు బహుదూర్ క్లాస్ ఆడియన్స్‌ ను థియేటర్లకు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ లెనిన్ విడుదలైన తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంది. ఎక్కువ థియేటర్లు కేటాయించే అవకాశం ఉండటంతో, ప్రస్తుతం ఉన్న వారం సమయం ఆ రెండింటీకి కీలకం. ఆ గ్యాప్‌ లో స్ట్రాంగ్ వసూళ్లు సాధించి, మంచి మౌత్ టాక్‌ కొనసాగించగలిగిన సినిమాకే లాభం దక్కే అవకాశం ఉంది.

Tags:    

Similar News