'రాకా' మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్...!
'పుష్ప' సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారి పోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప రెండు పార్ట్‌లు నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేశాయి.
'పుష్ప' సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారి పోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప రెండు పార్ట్‌లు నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేశాయి. రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించిన పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏంటి అనే ప్రశ్నకు ఇప్పటికే సమాధానం వచ్చింది. తమిళ స్టార్ దర్శకుడు, దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఇటీవలే 'రాకా' అనే టైటిల్‌ను ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే. 'రాకా' సినిమా రాక కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తమిళ, హిందీ, ఇతర అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి చిన్న లీక్ లేకుండా దర్శకుడు అట్లీ పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నాడు.
రాకా సినిమాలో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్‌ఎక్స్...
ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రికార్డ్ స్థాయి బడ్జెట్‌తో నిర్మాణం జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉండబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు యువ సంచలనం సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమిళనాడులోనే ఇప్పటి వరకు ఈయన పేరు మారుమ్రోగింది. రాకా సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా సాయి అభ్యంకర్ పేరు వినిపించబోతుంది అంటూ యూనిట్ సభ్యులు, అల్లు అర్జున్ సన్నిహితులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. సాయి అభ్యంకర్ పై దర్శకుడు అట్లీ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఇంత భారీ ప్రాజెక్ట్ ఆయన చేతిలో పెట్టడం ద్వారా సాయి అభ్యంకర్ ప్రతిభ ఏంటో అట్లీ చెప్పకనే చెప్పాడు. అల్లు అర్జున్ సైతం సాయి వర్క్ పట్ల చాలా సంతృత్తితో ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అల్లు అర్జున్, అట్లీ గురించి సాయి అభ్యంకర్...
తాజాగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఒక చిట్ చాట్‌లో మాట్లాడుతూ అట్లీ, అల్లు అర్జున్‌ల గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. సాయి అభ్యంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు గొప్ప వ్యక్తులతో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నట్లుగా సాయి పేర్కొన్నాడు. ఇంకా సాయి అభ్యంకర్ మాట్లాడుతూ... ప్రేక్షకులకు ఏం కావాలో అట్లీ సర్, అల్లు అర్జున్ సర్‌లకు బాగా తెలుసు. వారికి ప్రేక్షకుల అభిరుచి గురించి లోతైన అవగాహన ఉంది. ప్రతి నిర్ణయాన్ని ప్రేక్షకుల కోసం తీసుకుంటున్నారు. ప్రేక్షకులు ఏం చేస్తే ఎంటర్‌టైన్ అవుతారు అన్నట్లుగా వారిద్దరు చాలా లోతుగా ఆలోచించి ముందుకు సాగుతున్నారు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. చిన్న విషయంలోనూ తేడా రాకుండా లోతుగా విశ్లేషించి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారని అట్లీ, అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.
రాకా సినిమా విడుదల తేదీ...
'రాకా' సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. అత్యంత కీలకమైన పాత్రలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్‌లు కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. రష్మిక మందన్నను ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో చూడబోతున్నట్లుగానూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుంచి రష్మిక, మృణాల్‌లు నటిస్తున్నారనే విషయమై స్పష్టత రాలేదు. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు సైతం ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవల విడుదలైన రాకా టీజర్ అంచనాలు భారీగా పెంచేసింది. ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్ విషయమై పతాక స్థాయిలో చర్చ జరిగింది. పుష్ప ను మించి అన్నట్లుగా రాకా ఉండబోతుందని, కలెక్షన్స్ రెట్టింపు ఖాయం అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. 2027 డిసెంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 భాషల్లో రాకా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అనుకున్న డేట్‌కి రాకా ను విడుదల చేసేందుకు అట్లీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.