సినిమాలు కాదు ఇంస్టాగ్రామ్ ద్వారా భారీ ఆర్జన.. జాన్వీ కపూర్ సంపాదన ఎంతో తెలుసా?

ఇకపోతే తుమీ, హావెల్స్, లెన్స్ కార్ట్, ఒప్పో వంటి ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె.. ఈ ఒప్పందాల ద్వారా ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం.

Update: 2026-07-04 06:51 GMT

ఒకప్పుడు సెలబ్రిటీలకు సంపాదన అంటే సినిమాలు , బ్రాండ్ ప్రకటనలు, బిజినెస్ అంటూ కొన్ని మార్గాలను చెప్పేవారు. అయితే ఇప్పుడు వారు కేవలం తమ ఫోటోలు, బ్రాండ్స్ పోస్టుల ద్వారా కూడా ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు అంటే ఆశ్చర్యపోకమానరు.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలకు ఆదాయ వనరుగా మారిపోయింది. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును ఇన్స్టాగ్రామ్ వేదికగా ఉపయోగించుకుంటూ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు.

సోషల్ మీడియా ద్వారా భారీ ఆదాయం..

ఇకపోతే సినిమాల ద్వారా కంటే కూడా ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్న సెలబ్రిటీస్ లో జాన్వీ కపూర్ ప్రథమ స్థానంలో నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకొని.. ఇటు తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె ఇంస్టాగ్రామ్ లో 2.68 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్ వంటి ఇతర సోషల్ మీడియా వేదికలలో కూడా ఈమెకు మంచి ఆదరణ ఉంది. ఇక అలా ఫాలోవర్స్ ను బిజినెస్ గా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యింది జాన్వీ కపూర్. ఈ నేపథ్యంలోనే దేశీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లు తమ ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్ గా ఈమెను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సోషల్ మీడియా అకౌంటు, ప్రముఖ కంపెనీలకు అత్యంత విలువైన డిజిటల్ ప్రమోషన్ వేదికలుగా మారాయి అనడంలో సందేహం లేదు.

ఒక్క పోస్ట్ కి ఎన్ని లక్షలంటే..

ఇకపోతే ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక్క ప్రమోషనల్ పోస్ట్ పెడితే.. బ్రాండ్ విలువను బట్టి సుమారుగా రూ.8 నుండి రూ.11 లక్షల వరకు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఎక్స్ వేదికగా చేసే ఒక్కో బ్రాండెడ్ పోస్ట్ కి సుమారుగా రూ.5 నుండి రూ.8లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే కేవలం పోస్టులు మాత్రమే కాకుండా ప్రముఖ బ్రాండ్లతో ఒప్పందాలకు కూడా అదనంగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నెలకు కోటిన్నరకి పైగా ఆదాయం..

ఇకపోతే తుమీ, హావెల్స్, లెన్స్ కార్ట్, ఒప్పో వంటి ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె.. ఈ ఒప్పందాల ద్వారా ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. పైగా ప్రతినెలా బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ , గాడ్జెట్స్, టెక్నాలజీ ఉత్పత్తులకు సంబంధించిన అనేక బ్రాండ్ ప్రమోషన్లు ఈమె సోషల్ మీడియా ఖాతాలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ లెక్కన చూసుకుంటే.. నెలకు 1.5 కోట్లకు పైగా ఈమె ఆదాయం పొందుతుందని సమాచారం.

సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

ఇక సోషల్ మీడియా ద్వారానే కాదు సినిమాల పరంగా కూడా ఈమె భారీ పారితోషకం తీసుకుంటుంది. బాలీవుడ్ లో ఈమె నటిస్తున్న ఒక్కో చిత్రానికి బడ్జెట్ , నిర్మాణ సంస్థను బట్టి సుమారుగా రూ.6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక దక్షిణాది విషయానికొస్తే.. ఎన్టీఆర్ సరసన నటించినందుకుగానూ .. దేవర సినిమాలోని తన పాత్రకు రూ.3కోట్లు తీసుకున్న ఈమె.. రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా కోసం రూ.4కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇటు సినిమా రంగంలో అటు డిజిటల్ ప్రపంచాన్ని బిజినెస్ సూత్రంగా మార్చుకున్న జాన్వీ కపూర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రభావంతమైన యువ నటీమణులలో ఒకరిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.

Tags:    

Similar News