ప్ర‌భాస్ 'ఫౌజీ' బ‌డ్జెట్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

సౌత్‌లో మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల‌కు తెర‌తీసిన హీరో ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక‌లేకుండా గ‌డిపేస్తున్నారు.;

Update: 2025-04-19 20:30 GMT

సౌత్‌లో మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల‌కు తెర‌తీసిన హీరో ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక‌లేకుండా గ‌డిపేస్తున్నారు. ప్ర‌స్తుతం మారుతి డైరెక్ష‌న్‌లో `ది రాజా సాబ్‌`, మంచు విష్ణు `క‌న్న‌ప్ప‌`తో పాటు హ‌నురాఘ‌వ‌పూడి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్‌ `ఫౌజీ`లో న‌టిస్తున్నారు. వీటితో పాటు సందీప్‌రెడ్డి వంగ `స్పిరిట్`, ప్ర‌శాంత్ నీల్ `స‌లార్ శౌర్యాంగ ప‌ర్వం`, ప్ర‌శాంత్ వ‌ర్మ మూవీల్లో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు.

ఇటీవ‌లే షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చిన ప్ర‌భాస్ హాలీడేస్ వెకేష‌న్ కోసం ఇట‌లీ వెళ్లారు. అక్క‌డ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న త‌రువాత తిరిగి ఇండియా రానున్నారు. తిరిగి ఇండియా వ‌చ్చిన త‌రువాతే మారుతి `ది రాజా సాబ్‌` ప్రాజెక్ట్ షూటంగ్‌పై క్లారిటీ రానుంది. ఆ త‌రువాతే ఇత‌ర ప్రాజెక్ట్‌ల షూటింగ్‌ల‌పై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడితో క‌లిసి ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే.

`ఫౌజీ` పేరుతో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్పై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్ప‌డిన నేప‌థ్యంలో ఇండియ‌న్ క్రేజీ స్టార్ల‌ని ఇందులో న‌టింప‌జేస్తోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌య‌ప్ర‌ద‌ల‌ని కీల‌క పాత్ర‌ల కోసం ఎంపిక చేసుకున్నార‌ట‌. 1940లో సాగే క‌థ‌తో పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, డాన్స‌ర్ ఇమాన్వి ఇందులో ప్ర‌భాస్‌కు జోడీగా న‌టిస్తోంది.

రొమాంటిక్ వార్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్నీ సినిమా కోసం ఇటీవ‌లే కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బ‌డ్జెట్‌కు సంబంధించిన కీల‌క అప్ డేట్‌ని బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి తాజాగా ఓ య్యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ప్ర‌భాస్ షూటింగ్‌లో పాల్గొన‌లేదు. నాకు సంబంధించిన స‌న్నివేశాల కోసం నాపై ప్ర‌త్యేకంగా ఫొలోషూట్ నిర్వ‌హించారు. షూటింగ్ ప్రాంభించే లోపే నా చేయి ఫ్రాక్చ‌ర్ అయింది. దీంతో టీమ్ తొంద‌రేం లేదు రెస్ట్ తీసుకోండి అని చెప్పారు.

`ఫౌజీ` ఇదొక భారీ బ‌డ్జెట్ మూవీ. ఈ ప్రాజెక్ట్‌ని దాదాపు రూ.700 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌భాస్ ఈ నెల‌లోనే సెట్‌లోకి అడుగు పెట్ట‌బోతున్నాడు. నా కోసం ప్ర‌భాస్ త‌న డేట్స్ మార్చుకున్నారు. అది నాకు హార్ట్ ట‌చింగ్‌గా అనిపించింది` అని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. త‌న ప్రేమ కోసం యుద్ధం చేసిన ఓ వీర సైనికుడి క‌థ‌గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నారు.

Tags:    

Similar News