శంకర వరప్రసాద్ గారు సెకండ్ సాంగ్.. నిరాశలో డార్లింగ్ ఫ్యాన్స్
నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేసి ఆడియన్స్ ను అలరించనున్నారు.;
టాలీవుడ్ మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి, అనిల్ తో సినిమాను అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా మంచి హిట్ అవడంతో పాటూ మెగాస్టార్ ను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని అందరూ భావించారు.
గెస్ట్ రోల్ లో విక్టరీ వెంకటేష్
చిరంజీవి- అనిల్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో పాటూ అనిల్ రైటింగ్ కు చిరూ కామెడీ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో చూడ్డానికి మెగా ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేసి ఆడియన్స్ ను అలరించనున్నారు.
మీసాల పిల్ల సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్
మొదటి నుంచి ఈ మూవీపై ఆడియన్స్ కు మంచి అంచనాలుండగా, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటికొచ్చిన ప్రతీ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ గ్లింప్స్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ వరకు ప్రతీదీ బ్లాక్‌బస్టరే. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ 60 మిలియన్ల వ్యూస్ ను దాటేసి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా ఇప్పుడు సినిమాలోని సెకండ్ సింగిల్ పై అప్డేట్ వినిపిస్తోంది.
మన శంకరవరప్రసాద్ గారు సినిమా నుంచి సెకండ్ లిరికల్ నవంబర్ నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సెకండ్ సాంగ్ డ్యూయెట్ సాంగ్ గా రానుందని, ఫస్ట్ సాంగ్ లానే ఈ సాంగ్ లో కూడా చిరూ మంచి గ్రేస్ తో స్టెప్పులేయనున్నారని సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
కాగా 2026 సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ కానుండగా అందులో ఎంతో ముందుగా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది ఈ సినిమానే. మిగిలిన సినిమాలు, మరీ ముఖ్యంగా రాజా సాబ్ నుంచి ఇప్పటివరకు కనీసం ఫస్ట్ సింగిల్ కూడా రాకపోవంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో కొత్తగా చెప్పే పన్లేదు. అందులో భాగంగానే చిరూ సినిమాను కూడా అనిల్ చాలా డిఫరెంట్ గా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కానీ రిలీజ్ దగ్గరపడుతున్నప్పటికీ రాజా సాబ్ నుంచి ఇంకా కనీసం ఫస్ట్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.