రాజా చెయ్యి వేస్తే.. రెబల్ స్టార్ ఇంత లక్కీనా..?
రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ గా ఆయనకు ఉన్న క్రేజ్ కి ఆయన సింప్లిసిటీకి అసలు మ్యాచ్ అవ్వదు.;
రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ గా ఆయనకు ఉన్న క్రేజ్ కి ఆయన సింప్లిసిటీకి అసలు మ్యాచ్ అవ్వదు. అంతేకాదు అంత స్టార్ డం ఉన్న ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు. ఆఫ్ స్క్రీన్ కూల్ అండ్ కాం గా ఉండే ప్రభాస్ తెర మీద విజృంభిస్తే చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఐతే ప్రభాస్ కేవలం తన సినిమాలకే కాదు వేరే సినిమాలకు కూడా ప్లస్ అవుతుంటాడు. అదెలా అంటే ప్రభాస్ ఏదైనా సినిమా టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా సరే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.
రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1..
అంతకుముందు జాతిరత్నాలు సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్ రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ చేశారు. కాంతారా చాప్టర్ 1 ఎంతటి సంచలన విజయం అందుకుందో తెలిసిందే. ప్రభాస్ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయడమే కాదు వాయిస్ ఓవర్ ఇచ్చిన తేజా సజ్జా మిరాయ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా ఆది సాయి కుమార్ శంభాల సినిమా ట్రైలర్ కూడా పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.
ఇక లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ కాంత సినిమా ట్రైలర్ కూడా రెబల్ స్టార్ చేతుల మీదగా రిలీజైంది. ప్రభాస్ సెంటిమెంట్ సినిమాలకు చాలా ప్లస్ అవుతుంది. అసలే సినిమా వాళ్లకి సెంటిమెంట్స్ ఎక్కువ. ఇలా ప్రభాస్ తో ట్రైలర్ రిలీజ్ చేస్తే సినిమా హిట్ అని తెలిస్తే చాలు ప్రభాస్ ని ట్రైలర్ రిలీజ్ కోసం రిక్వెస్ట్ చేయడం ఎక్కువ అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ గా నిలుస్తున్నాడు.
ప్రభాస్ రాజు చేయి పడితే సినిమా సూపర్ హిట్టే..
ప్రభాస్ రాజు చేయి పడితే సినిమా సూపర్ హిట్టే అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తుంది. ప్రభాస్ తోనే ఎందుకు రిలీజ్ చేయించడం అంటే.. రెబల్ స్టార్ కి ఉన్న నేషనల్ లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో భాగంగా ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేస్తే అది కచ్చితంగా మంచి రీచ్ ఉంటుంది. ఇక కాస్త కూస్తో కంటెంట్ బాగుంది అంటే మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఆల్రెడీ ప్రభాస్ హ్యాండ్ పాజిటివ్ వైబ్ తీసుకు రావడమే కాదు సూపర్ హిట్ సెంటిమెంట్ గా మారింది. ఆది సాయి కుమార్ శంభాల సినిమా డిసెంబర్ 25న రిలీజ్ అవుతుంది. ఐతే దుల్కర్ సల్మాన్ కాంత మాత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాంత ట్రైలర్ చూస్తే దుల్కర్ మరోసారి తన టాలెంట్ చూపించాడని అనిపిస్తుంది.
ప్రభాస్ ప్రమోట్ చేసిన సినిమాలు..
కాంతాలో రానా కూడా అదిరిపోయే రోల్ లో కనిపిస్తున్నాడు. భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రభాస్ సెంటిమెంట్ ని కొనసాగించేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. రెబల్ ఫ్యాన్స్ మాత్రం ఇలా ప్రభాస్ ప్రమోట్ చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో వాళ్లు కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు. రెబల్ స్టార్ చేయి పడింది అంటే ఆ సినిమా రిజల్ట్ హిట్టే అనే టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తుంది. అదే మ్యాజిక్ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
ప్రభాస్ రిలీజ్ చేశాడని కాదు కానీ ఆ సినిమాల్లో విషయం ఉండటం వల్లే సక్సెస్ అవుతాయి. కానీ ప్రభాస్ చేత ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడం వల్ల ఎక్కువమందికి రీచ్ అవుతుంది.