ప్రభాస్.. ఆదిత్య ధర్.. ఇంత సడన్ గా ఎందుకు?
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్ ను హ్యాండిల్ చేయాలంటే ఆదిత్య లాంటి ఇంటెన్స్ మేకింగ్ ఉన్న డైరెక్టర్ కరెక్ట్ గా సెట్ అవుతాడని ట్రేడ్ వర్గాల్లో ఒక టాక్ ఉంది.
సోషల్ మీడియాలో ప్రభాస్ పేరుతో ప్రతిరోజూ ఒక కొత్త ప్రాజెక్ట్ ట్రెండ్ అవ్వడం రొటీన్ అయిపోయింది. లేటెస్ట్ గా ఈ లిస్టులోకి బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు వచ్చి చేరింది. అయితే మిగతా రూమర్స్ కి భిన్నంగా ఈ వార్త మాత్రం నెట్టింట గట్టిగానే వైరల్ అవుతోంది. అసలు వీళ్లిద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్స్ లేకపోయినా ఈ కాంబినేషన్ ఫిక్స్ అంటూ ఎందుకు అంత గట్టిగా వినిపిస్తుందనే దాని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది.
ఆదిత్య ధర్ అనగానే అందరికీ ముందుగా ఉరి సినిమానే గుర్తొస్తుంది. ఆ సినిమాతో నేషనల్ లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ డైరెక్టర్ ఆ తర్వాత కూడా తన సత్తా ఏంటో నిరూపించాడు. ఉరి తర్వాత రెండు భాగాలుగా వచ్చిన ధూరందర్ సినిమాతో కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. భారీ స్కేల్ లో యాక్షన్ సినిమాలను ఎమోషనల్ గా ఎలా తీయాలో ఆదిత్యకు బాగా తెలుసు అనే పేరు ఇండస్ట్రీలో ఉంది.
సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియా పేజ్ లు ఈ ప్రాజెక్ట్ ను గట్టిగా ఊహించుకుంటున్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్ ను హ్యాండిల్ చేయాలంటే ఆదిత్య లాంటి ఇంటెన్స్ మేకింగ్ ఉన్న డైరెక్టర్ కరెక్ట్ గా సెట్ అవుతాడని ట్రేడ్ వర్గాల్లో ఒక టాక్ ఉంది. స్క్రీన్ మీద హీరో ఎలివేషన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ తీసే విధానం ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనే అంచనాలతోనే ఈ రూమర్ కు ఇంత హైప్ క్రియేట్ అయింది.
పేపర్ మీద ఈ కాంబినేషన్ ఎంత క్రేజీగా అనిపించినా ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం ఇది ఇప్పట్లో జరిగే పని కాదు. ప్రభాస్ డైరీలో కనీసం సూది గుచ్చడానికి కూడా ఖాళీ లేదు. ప్రెజెంట్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సెట్స్ పైనే ఉంది. ఇవి కాకుండా నాగ్ అశ్విన్ కల్కి 2 కూడా క్యూలో వెయిట్ చేస్తోంది. ఈ లైనప్ చూస్తే 2028 దాటే వరకు ప్రభాస్ ఫ్రీ అయ్యే ఛాన్సే లేదు.
అటు ఆదిత్య ధర్ కూడా ఓ కమిట్మెంట్ తో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ తర్వాత తన నెక్స్ట్ టార్గెట్ గా మళ్ళీ రణవీర్ సింగ్ తో ఒక భారీ యాక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పనుల్లోనే అతను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇద్దరూ తమ తమ భారీ ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పుడు మధ్యలో ఇంకో కొత్త సినిమా డిస్కషన్స్ పెట్టుకోవడం అనేది ఏమాత్రం ప్రాక్టికల్ గా వర్కౌట్ కాని విషయం.
ప్రభాస్ ఆదిత్య కాంబో అనేది ప్రస్తుతానికి కేవలం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఫ్యాన్స్ కు కావాల్సిన ఒక కిక్కింగ్ థాట్ ను ఎవరో సోషల్ మీడియాలో వదిలితే అది కాస్తా ఫుల్ గా వైరల్ అయిపోయింది. భవిష్యత్తులో వీళ్లిద్దరికీ టైమ్ సెట్ అయితే ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు. కానీ ప్రస్తుతానికి వస్తున్న వార్తల్లో ఎలాంటి పస లేదని, జస్ట్ ఆన్లైన్ బజ్ కోసం అటెన్షన్ కోసం మాత్రమే ఈ హడావుడి జరుగుతోందని ఈజీగా అర్థం చేసుకోవచ్చు.