విశాఖపట్నం నేల నుంచి కోరుతున్నా : పవన్ కళ్యాణ్

అందుకే ఈ సినిమా మీరు అందరు ఆనందించే గొప్ప విజయం సాధించాలని విశాఖపట్నం నేల నుంచి సరస్వతి మాతను కోరుతున్నా అన్నారు పవన్ కళ్యాణ్.;

Update: 2025-07-23 16:19 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ప్రీమియర్స్ కి ఇంకా రెండు గంటలు మాత్రమే టైం ఉంది. అయినా కూడా సినిమా కోసం లాస్ట్ మినిట్ వరకు ప్రమోషన్స్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో ఒక ఈవెంట్ చేయగా అక్కడ పవర్ స్టార్ స్పీచ్ అలరించింది. ఇక వైజాగ్ ఆడియన్స్ కోసం మరోసారి విశాఖపట్నంలో మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర యూనిట్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

వైజాగ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మరోసారి తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు. వైజాగ్ తనకు చాలా స్పెషల్ అని చెప్పిన పవన్ కళ్యాణ్. ఇక్కడ సత్యానంద్ గారి దగ్గరే తాను నటనా శిక్షణ తీసుకున్నా అని అన్నారు. ఇక రెండేళ్ల క్రితం ఇక్కడే నోవాటెల్ లో తనని బయటకు రానివ్వకుండా అరెస్ట్ చేయాలని చూస్తే మీరంతా వచ్చి నాకోసం నిలబడ్డారు. అందుకే వైజాగ్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానని పవన్ కళ్యాణ్ అన్నారు.

తనకు నటనా శిక్షణ ఇచ్చిన సత్యానంద్, వీరమల్లు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లకు శాలువాతో సత్కరించారు పవన్ కళ్యాణ్. ఇక సినిమా కోసం కష్టడిన వారందరి గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా చేశానని చెప్పారు పవన్ కళ్యాణ్. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ వల్ల ఈ సినిమాకు కంపోజింగ్ చేశానని అన్నారు. ఫైట్స్ అంటే ఏదో చేశాం లే అన్నట్టు కాకుండా ఈ సీక్వెన్స్ కోసం ప్రయత్నించామని అన్నారు.

ఇక తనతో అన్నా గబ్బర్ సింగ్ లాంటి హిట్ కావాలని ఫ్యాన్స్ అంటారు. అందుకే ఈ సినిమా మీరు అందరు ఆనందించే గొప్ప విజయం సాధించాలని విశాఖపట్నం నేల నుంచి సరస్వతి మాతను కోరుతున్నా అన్నారు పవన్ కళ్యాణ్. సినిమాకు నెల రోజుల ముందు నుంచి ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ గురించి చెప్పారు పవన్. సినిమా తాను కూడా ప్రమోట్ చేయాలని నిన్న మొత్తం ఇంటర్వ్యూస్ ఇచ్చామని అయినా సరే వైజాగ్ లో ఒక ఈవెంట్ జరపాలని భావించా.. అందుకే ఈవెంట్ నిర్వహించామని అన్నారు పవన్ కళ్యాణ్.

ఈ సినిమా టికెట్ రేట్ల విషయం గురించి చెబుతూ.. గత ప్రభుత్వం తన సినిమాలకు 10, 15 రూ.ల రేట్లు ఫిక్స్ చేసింది. మిగతా వారి సినిమాలకు 150, 200 ఇచ్చారు. ఐతే వీరమల్లు సినిమాకు టికెట్ రేట్ల్ పెంచే విషయమై తన ప్రమేయం ఏం లేకుండా తాను కలగ చేసుకోకుండా సీఎం దగ్గరకు పంపించానని.. సీఎం ఎలా చెబితే అలా అనుకున్నామని అన్నారు పవన్ కళ్యాణ్.

Tags:    

Similar News