నిర్మాత‌పై పోలీస్‌ కేసు పెట్ట‌లేద‌న్న న‌టి

పూన‌మ్ ఆరోప‌ణ‌ల అనంత‌రం రాజ్ కుంద్రాపై పోలీసులు లోతుగా విచారించ‌గా, నీలి చిత్రాల యాప్ ల క‌థ‌లు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి.;

Update: 2025-07-22 04:26 GMT

మొబైల్ యాప్‌ల కోసం న‌టీమ‌ణుల‌తో అస‌భ్య‌క‌ర చిత్రాల రూప‌క‌ల్ప‌న, పోస్టింగుల వ్య‌వ‌హారంలో శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌ల పాటు జైలులో ఉన్న రాజ్ కుంద్రా ఆ త‌ర్వాత బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇదిలా ఉంటే, ఈ కేసు న‌మోద‌వ్వ‌డానికి ముందే రాజ్ కుంద్రాపై న‌టి పూన‌మ్ పాండే తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. పూన‌మ్ ఆరోప‌ణ‌ల అనంత‌రం రాజ్ కుంద్రాపై పోలీసులు లోతుగా విచారించ‌గా, నీలి చిత్రాల యాప్ ల క‌థ‌లు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో పూన‌మ్ పాండే మాట్లాడుతూ, తాను రాజ్ కుంద్రాపై ఎప్పుడూ పోలీసు కేసు పెట్ట‌లేద‌ని తెలిపారు. కాంట్రాక్టు ముగిసినా కానీ త‌న వీడియోల‌ను వినియోగించుకోవ‌డంపై ఆరోపించాన‌ని మాత్ర‌మే పూన‌మ్ తెలిపింది. ఒక స్వీట్ ఫ్యామిలీ నుంచి రాజ్ కుంద్రా వ‌చ్చారు. కానీ మా కాంట్రాక్ట్ ముగిశాక కూడా అత‌డి కంపెనీ నా వీడియోల‌ను ఉప‌యోగించుకోవ‌డం గురించిన గొడ‌వ చేసాను. అత‌డితో ఇత‌ర విష‌యాల్లో నాకు ఎలాంటి సంబంధం లేద‌ని పూనమ్ పాండే పేర్కొంది. రాజ్ కుంద్రాపై తాను ఎప్పుడూ పోలీస్ కేసు పెట్టలేదని, నాతో నేరుగా అత‌డికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.

అయితే కుంద్రాపై పోలీస్ కేసు పెట్ట‌క‌పోయినా కోర్టుల ప‌రిధిలో పూన‌మ్ పోరాడింది. రాజ్ తో న్యాయ‌పోరాట స‌మ‌యంలో తన వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను లీక్ చేశారని, దీనితో త‌న‌కు ఆన్ లైన్ లో చాలా ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని తెలిపింది. మొబైల్ నంబ‌ర్ లీక్ కావ‌డంతో వేధింపులు, బెదిరింపులు ఎదుర‌య్యాయ‌ని పాండే ఆరోపించింది. అలాగే కొన్ని రకాల కంటెంట్ కోసం స‌హ‌క‌రించాల‌ని బెదిరించి ఒప్పందంపై సంతకం చేయమన్నార‌ని కూడా పాండే ఆరోపించింది.

ఈ కేసు పోలీసు దర్యాప్తుకు దారితీయ‌డంతో మొబైల్ యాప్‌ల ద్వారా అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తున్నాడ‌ని రాజ్ కుంద్రాపై కొత్త కేసు న‌మోదైంది. కుంద్రాను జూలై 2021లో అరెస్టు చేశారు. అటువంటి కంటెంట్‌ను తయారు చేసి పంపిణీ చేశాడని ఆరోపిస్తూ మహారాష్ట్ర సైబర్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కుంద్రా, పాండే , షెర్లిన్ చోప్రాలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Tags:    

Similar News