ఐటం పాట కోసం అమ్మడు అభ్య‌ర్ద‌న‌?

ముంబై బ్యూటీ పూజాహెగ్డే టాలీవుడ్ కంబ్యాక్ కోసం ఎంత ఆశ‌గా ఎదురు చూస్తోందో తెలిసిందే. కానీ ఆ ఛాన్సే రావ‌డం లేదు.;

Update: 2025-10-25 21:30 GMT

ముంబై బ్యూటీ పూజాహెగ్డే టాలీవుడ్ కంబ్యాక్ కోసం ఎంత ఆశ‌గా ఎదురు చూస్తోందో తెలిసిందే. కానీ ఆ ఛాన్సే రావ‌డం లేదు. తాను చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేయ‌గా చివ‌రికి దుల్కార్ స‌ల్మాన్ 14వ చిత్రంలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా తెలుగులో చేస్తున్నా? హీరో మాలీవుడ్ కు చెందిన వారు కావ‌డంతో? పూజాహెగ్డే కంబ్యాక్ ఆశ ప‌రిపూర్ణం కాలేదు. అమ్మ‌డు టాలీవుడ్ స్టార్ హీరోతో కంబ్యాక్ అవ్వాల‌న్న‌ది ఆశ‌. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. ప్ర‌త్యేకంగా మేనేజ‌ర్ల‌ను అపాయింట్ చేసుకుని? పాత ప‌రిచ‌యాల్ని ట‌చ్ లోకి తీసుకున్నా? ప‌న‌వ్వ‌డం లేదు.

ఒక్క ఛాన్స్ ప్లీజ్:

ఈ నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం తెలిసింది. హీరోయిన్ ఛాన్స్ దేవుడు ఎరుగు కానీ...ఐటం భామ ఛాన్స్ అయినా వ‌స్తే చాలు అనుకుంటున్న‌ట్లు స‌న్నివేశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. గ్లోబ‌ల్ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీపికా ప‌దుకొణే స‌హా మ‌రో ఇద్ద‌రు భామ‌లు ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కాక‌పోయినా? ఐటం భామ‌గా ఛాన్స్ వ‌చ్చినా? చాలు అని ఎదురు చూస్తోందిట‌.

రిజెక్ట్ చేసే ఛాన్స్ లేకుండా:

ఇటీవ‌లే అమ్మ‌డు ఐటం పాట ఛాన్స్ ఉంటే త‌న‌కే ఆ అవ‌కాశం ఇవ్వాల‌ని మేక‌ర్స్ ను రిక్వెస్ట్ చేసిందిట‌. వాళ్లు కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. కొంత కాలంగా మేనేజ‌ర్స్ ద్వారా ప్ర‌యత్నాలు చేస్తున్నా? ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల నుంచి స‌రైన రెస్పాన్స్ రాక‌పోవ‌డంతో పూజా నేరుగా రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఇది వ‌ర్కౌట్ అయ్యేప్లానే. వాళ్ల‌తో..వీళ్ల‌తో అడిగించ‌డం కంటే నేరుగా క్యాండెట్ సీన్ లో ఉంటే క‌న్సిడ‌ర్ చేసే అవ‌కాశం ఉంటుంది. తెలిసిన వాళ్లను నేరుగా వారి ముందుకే వ‌చ్చి అవ‌కాశం అడిగితే? తొంద‌ర‌గా రిజెక్ట్ చేయ‌డానికి అవ‌కాశం ఉండ‌దు.

ల‌క్కీగా కోలీవుడ్ ఆదుకుంది:

ఆ సినిమాలో కాక‌పోతే మ‌రో సినిమాలో ఛాన్స్ ఇవ్వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కెరీర్ ఆరంభంలో ఏ న‌టి అయినా చేసే ప‌నే ఇది. అయితే స‌క్సెస్ అయిన త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశాల‌ను కాద‌నుకుని వెళ్తే ఈ ర‌క‌మైన ప‌రిస్థితులు త‌ప్పవు. పూజాహెగ్డే అలాంటి త‌ప్పిద‌మే చేసింది. అయితే ఉత్త‌రాదిన అవ‌కాశాలు రావు అన్న విష‌యాన్ని వేగంగానే గ్ర‌హించిం సౌత్ లో కంబ్యాక్ ప్ర‌య‌త్నాలు చేసి ల‌క్కీగా కోలీవుడ్ లో బిజీ అయింది. లేదంటే? అక్క‌డ కూడా లైట్ తీసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డేది.

Tags:    

Similar News