జిమ్ నుంచి వెళుతూ పూజా చిక్కిందిలా
టాలీవుడ్ లో అవకాశాలు ముఖం చాటేసినా, కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది పూజా హెగ్డే.;
టాలీవుడ్ లో అవకాశాలు ముఖం చాటేసినా, కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది పూజా హెగ్డే. అటు బాలీవుడ్ లోను ఈ భామకు అవకాశాలకు కొదవేమీ లేదు. ప్రస్తుతం `జన నాయగన్` అనే చిత్రంలో దళపతి విజయ్ సరసన నటిస్తోంది. కోలీవుడ్ బాలీవుడ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఈ అమ్మడు నిరంతర విమాన ప్రయాణాలు చేస్తోంది.
పూజా ఓ వైపు చెన్నై టు ముంబై ప్రయాణాలతో బిజీగా ఉన్నా, జిమ్ యోగా సెషన్స్ ని మాత్రం విడిచిపెట్టడం లేదు. ఫిట్నెస్ ఫ్రీక్ నిరంతరం జిమ్ కి వెళుతోంది. తాజాగా ముంబై శాంటాక్రజ్ లో జిమ్ ముగించి ఇంటికి వెళుతూ పూజా ఫోటోగ్రాఫర్ల కంట పడింది. పూజా బ్లాక్ కలర్ బాడీ ఫిట్ స్పోర్ట్స్ దుస్తుల్లో కనిపించింది. అయితే తన భుజంపై పింక్ కలర్ పట్టీ దేనికో చెప్పనే లేదు. చేతికి వైట్ హ్యాండ్ బ్యాగ్, కాళ్లకు వైట్ స్పోర్ట్స్ షూస్ ధరించి కనిపించింది. అలా జిమ్ నుంచి బయటకు వచ్చి కార్ వైపు వెళుతున్న పూజాను ఫోటోగ్రాఫర్లు కొన్ని క్లిక్స్ కి సహకరించాల్సిందిగా కోరుతున్నారు. కానీ పూజా వారితో మాట్లాడుతూనే కార్ ఎక్కి వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. పూజా సింపుల్ గా మేకప్ లెస్ లుక్ లో కనిపించింది. జిమ్‌లో కఠినంగా శ్రమించిందని తన రూపం చెబుతోంది. పూజాలోని ఈ డెడికేషన్ తన టోన్డ్ ఫిట్ బాడీని హైలైట్ చేస్తోంది. ఇటీవలే సమంత ముంబై బాంద్రాలో జిమ్ నుంచి వెళుతూ కెమెరాల కంటికి చిక్కింది. ఇదే సెలబ్రిటీ ఏరియాలో మలైకా, ప్రగ్య జైశ్వాల్, రకుల్ ప్రీత్ లాంటి భామలు జిమ్ లో కుస్తీలు పడుతూ ఫోలోలకు ఫోజులివ్వడం చూస్తున్నదే. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే... పూజా నటించిన జననాయగన్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.