బుట్టబొమ్మని కాపాడే బాధ్యత ఇక తనదేనా?
`ఒక లైలా కోసం` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బుట్టబొమ్మ `ముకుంద`తో గోపీకమ్మలా మెరిసి ఔరా అనిపించింది.;
ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో.. ఎవరు రాత్రికి రాత్రే ఎవరు స్టార్ అయిపోతారో.. కాలం కలిసి రాకపోతే ఎవరు ఎలాంటి పతనానికి గురవుతారో చెప్పడం కష్టం. ఇక్కడ ఏదైనా సాధ్యమే. లేట్ వయసులో స్టార్స్ అయిన వాళ్లూ వున్నారు. మంచి క్రేజ్‌లో ఉండగానే కనుమరుగైన వాళ్లూ ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఒక దశలో గోవా బ్యూటీ ఇలియానా తరహాలో క్రేజీ ఆఫర్లని దక్కించుకుని స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.
`ఒక లైలా కోసం` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బుట్టబొమ్మ `ముకుంద`తో గోపీకమ్మలా మెరిసి ఔరా అనిపించింది. దీంతో ఆమెపై ఇండస్ట్రీలోని క్రేజీ డైరెక్టర్ల దృష్టిపడింది. ఇదే సమయంలో హృతిక్ రోషన్‌తో సినిమా చేసి షాక్ ఇచ్చిన పూజ డీజే, రంగస్థలం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో వంటి క్రేజీ సినిమాలతో సందడి చేసి ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అదే స్థాయిలో భారీ డిమాండ్‌ని కూడా క్రియేట్ చేసుకుంది.
అయితే ఆ క్రేజ్ ఇలియానా కెరీర్ తరహాలో ఎంతో కాలం నిలవ లేదు. ప్రభాస్ `రాధేశ్యామ్`తో ఈ అమ్మడి డౌన్ ఫాల్ మొదలైంది. ఆచార్య, సర్కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్, దేవా, రీసెంట్‌గా రెట్రో..ఇలా వరుస ఫ్లాప్‌లు, డిజాస్టర్లతో బుట్టబొమ్మ కెరీర్ పతనావస్థకు చేరి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో మూడు సినిమాల్లో మాత్రమే తను హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ తో చేస్తున్న `జననాయగన్`పై భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఇందులో తనతో పాటు `ప్రేమలు` ఫేమ్ మమితా బైజు, శృతిహాసన్ (గెస్ట్ రోల్), ప్రియమణి నటిస్తున్నారు.
దీంతో తన దృష్టి మొత్తం రాఘవ లారెన్స్ `కాంచన 4`పై పెట్టింది. ముని సిరీస్‌లో భాగంగా వస్తున్న ఐదవ సినిమా ఇది. నోరా ఫతే మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలన్నది పూజా హెగ్డే ప్లాన్. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీగా పేరున్న కాంచన సిరీస్ లో భాగంగా రానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. లారెన్స్ కు కూడా ఇది క్రూషియల్ ప్రాజెక్ట్. ఇటీవల చేసిన సినిమాలేవీ ఆ స్థాయిలో ఇంపాక్ట్‌ని కలిగించలేకపోవడంతో లారెన్స్ కూడా ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట. తన ప్లానింగ్ ఫలించి బుట్టబొమ్మకు బ్లాక్ బస్టర్ లభించే మళ్లీ ట్రాక్ లోకి రావడం ఖాయం.