పిక్‌టాక్ : చీకటిలో అందాల పూజ
చీకటిలో లైట్ వెలుతురులో పూజా హెగ్డే అందంగా కనిపిస్తోంది. కవ్వించే విధంగా చూస్తున్న పూజా హెగ్డే ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి.;
బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈమధ్య కాలంలో టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. తెలుగులో ఈమె చివరగా రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అదే ఏడాది ఆచార్య, ఎఫ్ 3 సినిమాల్లో ముఖ్య పాత్రల్లో, ఐటెం సాంగ్‌లో కనిపించింది. పూజా హెగ్డే గత ఏడాదిలో ఒక్క సినిమాను విడుదల చేయలేక పోయింది. దాదాపు రెండేళ్లు పెద్దగా ఆఫర్లు లేకుండానే కెరీర్‌ను నెట్టుకు వచ్చిన పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం అర డజను సినిమాలు ఉన్నాయి. అవన్నీ తమిళ్, హిందీ సినిమాలు కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటికే బాలీవుడ్ మూవీ 'దేవా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుని ఉంది.
తమిళ్‌లో ప్రస్తుతం ఈమె చేస్తున్న సూర్య 'రెట్రో'కి మంచి బజ్ ఉంది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్‌లో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందీలో ఈమెకు వరుసగా ఆఫర్లు తలుపు తడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటినా కూడా అందం విషయంలో ఏమాత్రం తగ్గకుండా గతంతో పోల్చితే ఇంకాస్త ఎక్కువ అందంగా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రజనీకాంత్ 'కూలీ' సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కించుకోవడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలవడం మాత్రమే కాకుండా మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో పూజా హెగ్డే రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తక్కువ కాకుండా దాదాపుగా 28 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పూజా హెగ్డే కలిగి ఉంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లోనూ అదే స్థాయిలో ఈ అమ్మడికి ఫాలోయింగ్ ఉంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా సుదీర్ఘ కాలం పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లో కొనసాగాలి అంటే అందాల ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉండాలి. అందుకు తగ్గట్లుగానే పూజా హెగ్డే రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ డార్క్ షేర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
చీకటిలో లైట్ వెలుతురులో పూజా హెగ్డే అందంగా కనిపిస్తోంది. కవ్వించే విధంగా చూస్తున్న పూజా హెగ్డే ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఎంత అందంగా ఉన్న ఫోటోల్లో క్రియేటివిటీ ఉండాలి అంటారు. పూజా హెగ్డే ఫోటోల్లో ఎక్కువ శాతం క్రియేటివిటీ కనిపిస్తుందని, ఆమె సెల్ఫీ తీసుకున్నా చాలా భిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందాల పూజా హెగ్డే మరోసారి ఆకట్టుకునే విధంగా ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాలు చేయని ఈ అమ్మడు వచ్చే ఏడాదిలో అయినా టాలీవుడ్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.