పిక్‌టాక్ : బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిన అందాల పూజా

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఫోటోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌కి వినోదాన్ని పంచే పూజా హెగ్డే మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.;

Update: 2025-04-19 11:03 GMT

మూగమూడి అనే తమిళ మూవీతో 2012లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. మొదటి సినిమా నిరాశ పరచడంతో తదుపరి ఆఫర్‌ కోసం దాదాపు రెండేళ్ల సమయం వేచి చూడాల్సి వచ్చింది. 2014లో ఒక లైలా కోసం సినిమాలో నాగ చైతన్య కు జోడీగా నటించింది. ఆ వెంటనే ముకుంద సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్‌కి జోడీగా నటించింది. రెండు సినిమాలు కూడా పెద్దగా కమర్షియల్‌ గా నిరాశ పరచాయి. అదే సమయంలో బాలీవుడ్‌లో ఈ అమ్మడికి లక్కీగా మొహెంజోదారో సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా కోసం దాదాపు రెండేళ్ల సమయం కేటాయించింది. కానీ ఆ సినిమా నిరాశ పరచడంతో మళ్లీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.


అల్లు అర్జున్‌కి జోడీగా నటించిన 'డీజే : దువ్వాడ జగన్నాథం' సినిమాతో పూజా హెగ్డే కెరీర్‌ మారిపోయింది. 2017లో వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ అనూహ్యంగా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. తెలుగులో సినిమా ఆఫర్లు దక్కడం లేదు. ఆ మధ్య ఖాళీగా ఉన్న పూజా హెగ్డే ఈ మధ్య కాస్త బిజీ అయింది. ప్రస్తుతం ఈమె తమిళ్‌లో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న కారణంగా కోలీవుడ్‌పై ఆశలు పెట్టుకుని ఉంది. కోలీవుడ్‌ నుంచి రాబోయే మూడు నాలుగు ఏళ్లలో ఈమె నటించే సినిమాలు వరుసగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఫోటోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌కి వినోదాన్ని పంచే పూజా హెగ్డే మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 27.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు ప్రముఖ మ్యాగజైన్‌ల కవర్‌ పేజీల కోసం అందాల ఫోటో షూట్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి ప్రముఖ మ్యాగజైన్‌ ఎల్లీ ఇండియా కోసం ఫోటో షూట్‌ ఇచ్చింది. బ్లాక్‌ డ్రెస్‌లో ఈ అమ్మడు కవర్‌ పై కన్నుల విందు చేసింది. పూజా హెగ్డే బ్రేకింగ్‌ ది బౌండరీస్‌ అనే టైటిల్‌తో కవర్‌ పేజ్ స్టోరీని ఎల్లీ ఇండియా మ్యాగజైన్‌ ప్రచురించింది. కవర్ ఫోటో స్టిల్‌తో ఎల్లీ ఇండియా మ్యాగజైన్‌కి అందం తీసుకు వచ్చిందని నెటిజన్స్ అంటున్నారు.

పూజా హెగ్డే ప్రస్తుతం సూర్యతో కలిసి 'రెట్రో' సినిమాలో నటించింది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో పూజా లుక్‌ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని విధాలుగా పూజా హెగ్డే లుక్‌ బాగుంది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. విజయ్‌తో కలిసి జన నాయగన్‌ సినిమాలో నటించింది. విజయ్‌కి ఆ సినిమా చివరి మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక లారెన్స్‌ సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ కాంచన 4 లోనూ పూజా హెగ్డే నటించబోతుంది. హీరోయిన్‌గానే కాకుండా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మూవీ కూలీలో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా సర్‌ప్రైజ్ చేసింది. తమిళనాట రూపొందుతున్న ఈ సినిమాలన్నీ తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Tags:    

Similar News