పూజా కెరీర్ కు 2026 డూ ఆర్ డై ఇయర్?
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచిన పూజా హెగ్డే ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలక దశను ఎదుర్కొంటోంది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచిన పూజా హెగ్డే ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలక దశను ఎదుర్కొంటోంది. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆమె స్థాయి మరింత పెరుగుతుందని అభిమానులు, సినీ వర్గాలు భావించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోయాయి. ప్రభాస్‌తో చేసిన రాధే శ్యామ్, రామ్ చరణ్‌తో ఆచార్య, సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, రణవీర్ సింగ్ సర్కస్, కోలీవుడ్ లో సూర్య తో చేసిన రెట్రో లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలు దక్కినా, వాటిని సక్సెస్‌లుగా మార్చుకోలేకపోవడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపింది. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ కూడా పెరిగాయి. అయితే ఈ ఫ్లాపులన్నింటికీ పూజానే బాధ్యత వహించాలా? లేక స్క్రిప్ట్ ఎంపికలు, సినిమా కంటెంట్, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు కూడా కారణమా? అనే చర్చ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
గత కొన్నేళ్లుగా ప్రేక్షకులు కేవలం స్టార్ కాస్టింగ్ లేదా గ్లామర్ కంటే బలమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే సమయంలో నయనతార, త్రిష, తమన్నా వంటి హీరోయిన్లు తమ కెరీర్‌ను కొత్త తరహా పాత్రలతో ముందుకు తీసుకెళ్లగలిగారు. పూజా హెగ్డే మాత్రం ఇప్పటికీ ప్రధానంగా కమర్షియల్ ఫార్ములా సినిమాలపైనే ఆధారపడిందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే రెట్రోలో ఆమె చూపించిన డీ గ్లామర్ నటనకు ప్రశంసలు లభించాయి. సినిమా రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, నటిగా తనలో మరో కోణం ఉందని పూజా నిరూపించగలిగింది.
ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం పూజా హెగ్డే కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు తన ఫ్యూచర్ ను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ భగవంత్ కేసరి రీమేక్‌గా తెరకెక్కుతున్న జన నాయకుడులో ఆమె చేస్తున్న పాత్రపై మంచి అంచనాలున్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్‌తో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కూడా యూత్ ఆడియన్స్ ను ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న సినిమా మాత్రం రాఘవేంద్ర లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచన4. హారర్ జానర్‌లో పూజా తొలిసారి నటిస్తుండగా, ఈ సినిమాలో ఆమె లుక్, క్యారెక్టర్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటాయని సమాచారం. కాంచన ఫ్రాంచైజ్‌కు ఉన్న మార్కెట్, లారెన్స్ ట్రాక్ రికార్డు దృష్ట్యా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటే పూజా కెరీర్‌కు అది నిజమైన టర్నింగ్ పాయింట్ కావచ్చు. ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే, ఫ్లాపులు వెంటాడుతున్నా పూజా హెగ్డే ఇంకా రేసులోనే ఉందని చెప్పాలి. అయితే రాబోయే రెండేళ్లలో సరైన కథలు, బలమైన పాత్రలు, విజయవంతమైన సినిమాలు దక్కితేనే ఆమె మరోసారి స్టార్ హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 2026 ఆమె కెరీర్‌కు నిజంగానే డూ ఆర్ డై ఇయర్‌గా మారిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.అయితే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న సినిమా మాత్రం రాఘవేంద్ర లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచన4. హారర్ జానర్‌లో పూజా తొలిసారి నటిస్తుండగా, ఈ సినిమాలో ఆమె లుక్, క్యారెక్టర్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటాయని సమాచారం. కాంచన ఫ్రాంచైజ్‌కు ఉన్న మార్కెట్, లారెన్స్ ట్రాక్ రికార్డు దృష్ట్యా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటే పూజా కెరీర్‌కు అది నిజమైన టర్నింగ్ పాయింట్ కావచ్చు. ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే, ఫ్లాపులు వెంటాడుతున్నా పూజా హెగ్డే ఇంకా రేసులోనే ఉందని చెప్పాలి. అయితే రాబోయే రెండేళ్లలో సరైన కథలు, బలమైన పాత్రలు, విజయవంతమైన సినిమాలు దక్కితేనే ఆమె మరోసారి స్టార్ హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 2026 ఆమె కెరీర్‌కు నిజంగానే డూ ఆర్ డై ఇయర్‌గా మారిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.