షాకింగ్‌: బుట్ట‌బొమ్మ ఈ ల‌గ్జ‌రీ అల‌వాటు ఖ‌రీదు 1.5 కోట్లు!

ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుత‌మైన‌ ప్యాషన్ సెన్స్ తో జీవించే పూజ లైఫ్ స్టైల్ తమకు ఎంతో స్ఫూర్తిని ఇస్తోందంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

Update: 2026-07-13 04:17 GMT

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో తెలిసిందే. పోస్ట్ పెట్టిందంటే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోల గ్లింప్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజా పోస్ట్‌కు ``యు జ‌స్ట్ గోట్టా కీప్ ఇన్ లివిన్ , మ్యాన్ L-I-V-I-N`` (మనం కేవలం జీవితాన్ని ఆస్వాధిస్తూ బతకాలి) అనే ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను జోడించింది. షేర్ చేసిన ఫోటోల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ లైన్స్, సరికొత్త షార్ట్ హెయిర్ లుక్ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుత‌మైన‌ ప్యాషన్ సెన్స్ తో జీవించే పూజ లైఫ్ స్టైల్ తమకు ఎంతో స్ఫూర్తిని ఇస్తోందంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

 

బుట్ట‌బొమ్మ‌ కొటేషన్ చూడ‌గానే... అభిరుచితో జీవించడం అనేది ఆర్భాటంగా ఉండదు..అది క్రమశిక్షణలో, చిన్న చిన్న ఆనందాలలో, మంచి సంగీతంలో, వర్షపు రోజులలో, మనం జీవించి ఉన్నామనే భావన కలిగించే క్షణాలలో వ్యక్తమవుతుంది. కొంతమంది జ్ఞాపకాలను పోస్ట్ చేస్తారు. కానీ మీరు క్షణాలను..చివరి స్లైడ్ తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకునే ఒక జ్ఞాప‌కంగా మార్చేస్తారు... అంటూ నెటిజ‌నులు పూజాను ప్ర‌శంసించారు.

 

అయితే ఈ పోస్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం పూజా హెగ్డే ఇంట్లోని సరికొత్త విలాసవంతమైన ఆడియో మ్యూజిక్ సెటప్. హోమ్ థియేటర్, మ్యూజిక్ లవర్స్ (ఆడియోఫైల్స్) కలలుగనే అత్యంత ఖరీదైన గ్లోయింగ్ ట్యూబ్స్ కలిగిన మెకింతోస్మ - ఇటాలియన్ ఉడ్‌వర్క్‌తో రూపొందిన సోన‌స్ ఫ్యాబ‌ర్ బ్రాండ్లకు సంబంధించిన వరల్డ్ క్లాస్ సౌండ్ సిస్టమ్‌ను తన ఇంట్లో ఏర్పాటు చేసుకుంది. ఈ హై-ఎండ్ మ్యూజిక్ సిస్టమ్ లైనప్ చూసి నెటిజన్లు.. టెక్ ప్రియులు ఒక్కసారిగా నోరెళ్లబెడుతున్నారు.

 

ఈ క్రమంలోనే ఒక ఆడియో ఎక్స్‌పర్ట్ పూజా హెగ్డే హోమ్ మ్యూజిక్ సిస్టమ్‌లో ఉన్న ప్రతి పరికరం ఖరీదును లెక్కిస్తూ పెట్టిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల ప్రకారం.. పూజ తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సోన‌స్ ఫేబ‌ర్ హోమేజ్ వీవోఎక్స్ జి3 సెంటర్ స్పీకర్ ధర సుమారు 28 లక్షలు కాగా, సోన‌స్ ఫేబ‌ర్ హోమేజ్ వీవోఎక్స్ జి 5 ఫ్లోర్‌స్టాండర్స్ ధర సుమారు 63 లక్షలు. వీటితో పాటు అత్యంత శక్తివంతమైన మెకింతోష్ సి12000 ప్రీయాంప్ విలువ సుమారు 27 లక్షలుగా ఉంది.

 

మ్యూజిక్ సిస్టమ్‌లోని మిగిలిన పరికరాలైన మెకింతోష్ ఎంసీ830 మోనోబ్లాక్స్ ధర సుమారు 8 లక్షలు కాగా.. మెకింతోష్ లాబ్స్ ఎం.ఎక్స్ 180 ఏవీ ప్రాసెసర్ విలువ దాదాపు 26 లక్షలుగా ఉంది. ఈ లెక్కన పూజా హెగ్డే ఏర్పాటు చేసుకున్న ఈ లగ్జరీ ఆడియో సిస్టమ్ మొత్తం విలువ అక్షరాలా రూ.1,53,00,000 (ఒక కోటి యాభై మూడు లక్షల రూపాయలు) కావడం విశేషం. కేవలం మ్యూజిక్ వినడం కోసమే ఒక స్టార్ హీరోయిన్ ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

మ్యూజిక్ సిస్టమ్‌తో పాటు పూజా హెగ్డే వద్ద ఒక వింటేజ్ లుక్ కలిగిన `పెంటాక్స్ రేంజ్‌పైండ‌ర్` కెమెరా కూడా ఉన్నట్లు నెటిజన్లు ఈ పోస్ట్ ద్వారా గుర్తించారు. కేవలం జ్ఞాపకాలను ఫోటోలుగా పోస్ట్ చేయడమే కాకుండా.. తన పోస్ట్‌ల ద్వారా ప్రతి ఒక్కరికీ ఒక కొత్త అనుభూతిని అందించే వినూత్న శైలి పూజా హెగ్డే సొంతమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ లగ్జరీ లైఫ్ స్టైల్ పోస్ట్‌కు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తూ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. పూజా హెగ్డే న‌టించిన `జ‌న‌నాయ‌గ‌న్` సెన్సార్ క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డి త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ద‌ళ‌ప‌తి విజ‌య్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించారు.

Tags:    

Similar News