'ప‌రాశ‌క్తికి' లైన్ క్లియ‌ర్‌..థియేట‌ర్ల‌లో సంద‌డి షురూ!

సెన్సార్ వివాదం కార‌ణంగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాకు లైన్ క్లియ‌ర్ అయింది.;

Update: 2026-01-09 08:30 GMT

విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన పొలిటిక‌ల్ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామా 'జ‌న నాయ‌గ‌న్‌' సినిమా చుట్టూ సెన్సార్ వివాదం త‌లెత్త‌డం, దీనిపై మేక‌ర్స్ మ‌ద్రాస్ హైకోర్టుని ఆశ్ర‌యించ‌డం తెలిసిందే. తాజాగా మ‌ద్రాస్ హైకోర్టు 'జ‌న నాయ‌గ‌న్‌' యు/ ఏ స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిందేన‌ని సెన్సార్ బోర్డుకు అదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం తీర్పుని వెలువ‌రించింది. దీంతో విజ‌య్ అభిమానులు అడ్డంకులు తొల‌గిపోయాయ‌ని సంబ‌రాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సింగిల్ జ‌డ్జ్ తీర్పుని స‌వాల్ చేస్తూ సెన్సార్ బోర్డు అప్పీల్ చేసింది.

మ‌ద్రాస్ హైకోర్టు చీఫ్ జ‌స్టీస్ ధ‌ర్మాస‌నం ముందు అత్య‌వ‌స‌ర విచార‌ణ కోసం రిట్ పిటీష‌న్ దాఖ‌లు చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే ఇదే త‌ర‌హా ప‌రిస్థితిని మ‌రో త‌మిళ సినిమా ఎదుర్కొంటోంది. అదే 'ప‌రాశ‌క్తి'. శివ కార్తీకేయ‌న్‌, జ‌యం ర‌వి, అధ‌ర్వ‌, శ్రీ‌లీల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సుధా కొంగ‌ర డైరెక్ట్ చేసిన ఈ మూవీని డౌన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆకాష్ భాస్క‌ర‌న్ నిర్మించారు. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా జ‌న‌వ‌రి 10న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సెన్సార్ వివాదం కార‌ణంగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాకు లైన్ క్లియ‌ర్ అయింది. ఇన్ని రోజులు సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ విష‌యంలో తాత్సారం చేస్తూ వ‌చ్చిన సెన్సార్ బోర్డ్ ఎట్ట‌కేల‌కు ఈ మూవీ రిలీజ్‌కు ప‌చ్చ‌జెండా ఊపేసింది. U/A స‌ర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో శిన‌వారం 'ప‌రాశ‌క్తి' భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కు అడ్డుంకులు తొల‌గిపోయాయి. జ‌న‌వ‌రి 10న భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు.

ఇందులో భాగంగానే మేక‌ర్స్ ఈ మూవీ ని కొన్ని రోజుల ముందే సెన్సార్ బోర్డ్‌కు పంపించార‌ట‌. సినిమా చూసిన స‌భ్యులు ఏకంగా 23 క‌ట్స్ విధించ‌డ‌మే కాకుండా అద‌నంగా మ‌రిన్ని క‌ట్స్ చేయాల‌ని చెప్పార‌ట‌. సెన్సార్ తీరుపై ఆగ్ర‌హానికి గురైన ద‌ర్శ‌కురాలు సుధా కొంగ సెన్సార్ స‌ర్టిఫికెట్ కోసం ముంబ‌యిలోని రివిజ‌న్ క‌మిటీకి వెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది. దీంతో అనుకున్న టైమ్‌కు 'ప‌రాశ‌క్తి' విడుద‌ల కావ‌డం క‌ష్ట‌మేన‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో వినిపించింది. 1960వ ద‌శ‌కంలో మ‌ద్రాస్‌లో జ‌రిగిన హిందీ వ్య‌తిరేకోద్య‌మం నేప‌థ్యంలో ఈ సినిమాని తెర‌కెక్కించారు.

ఇందు కోసం ఆనాటి కాలాన్ని, ప‌రిస్థితుల్ని రీ క్రియేట్ చేసి ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చి ఈ మూవీని తెర‌కెక్కించారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల‌ని తీసుకుని ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు సుధా కొంగ‌ర‌. అవే ఇప్పుడు ఈ సినిమాకు ప్ర‌ధాన అడ్డంకిగా మారాయ‌ని, సినిమాలోని ప్ర‌ధాన స‌న్నివేశాల‌ని తొల‌గించాల‌ని సెన్సార్ బోర్డ్ చెప్ప‌డంతో సుధా కొంగ‌ర రివిజ‌న్ క‌మిటీకి వెళ్లిన‌ట్టు వార్త‌లు వినిపించాయి. అయితే సెన్సార్ వారు చెప్పిన క‌ట్స్‌కు డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర సుముఖ‌త వ్య‌క్తం చేసి స‌న్నివేశాల‌ని తొల‌గించ‌డంతో సినిమా రిలీజ్‌కు సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేసి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. దీంతో 'ప‌రాశ‌క్తి' య‌ధావిధిగా జ‌న‌వ‌రి 10న శ‌నివారం పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

Tags:    

Similar News