• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓపెనింగ్ సీక్వెన్స్ మిస్...

ఓపెనింగ్ సీక్వెన్స్ మిస్ అవొద్దు!

| మ‌ధురం షార్ట్ ఫిల్మ్ తో మంచి డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న ఫ‌ణీంద్ర న‌ర్సెట్టి ఇప్పుడు 8 వ‌సంతాలు అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2025-06-18 10:17 GMT

మ‌ధురం షార్ట్ ఫిల్మ్ తో మంచి డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న ఫ‌ణీంద్ర న‌ర్సెట్టి ఇప్పుడు 8 వ‌సంతాలు అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమాలో అనంతిక స‌నిల్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. జూన్ 20న 8 వ‌సంతాలు సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

8 వ‌సంతాలు సినిమా ఒక అమ్మాయి జ‌ర్నీ అని, 17 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఒక అమ్మాయి లైఫ్ లో జ‌రిగే క‌థ 8 వ‌సంతాలు అని, ఈ సినిమాకు డైరెక్ట‌ర్ ఫ‌ణి, హీరోయిన్ అనంతిక పిల్ల‌ర్లు లాంటి వాళ్ల‌ని, సినిమా విజువ‌ల్ గా అదిరిపోయింద‌ని, ఫ‌ణి ఈ సినిమాతో ఎంతో ఎమోష‌న‌ల్ కంటెంట్ ను ఆడియ‌న్స్ కు చెప్తున్నాడ‌ని, ఈ ప్ర‌య‌త్నం క‌చ్ఛితంగా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నట్టు నిర్మాత ర‌వి శంక‌ర్ చెప్పారు.

8 వ‌సంతాలు డిఫ‌రెంట్ సినిమా అని, క‌థ బాగా న‌చ్చి ఈ ప్ర‌య‌త్నం చేశామ‌ని, త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని, ఈ మూవీకి చాలా మంది కొత్త టాలెంట్ వ‌ర్క్ చేసింద‌ని, వారి కోస‌మైనా ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అవాల‌ని నిర్మాత న‌వీన్ యెర్నేని అన్నారు. మారుతున్న జెన‌రేష‌న్ లో క‌విత్వం అంట‌రాని భాష‌గా మారిపోయింద‌ని, కానీ దాన్ని ఓ ప‌రిమ‌ళంలా ఫ‌ణి త‌న మ‌నసుని అంటించుకున్నాడ‌ని లిరిక్ రైట‌ర్ వ‌న‌మాలి తెలిపారు.

సినిమాలో ఫ‌ణి రాసిన బ‌రువైన సంభాష‌ణ‌లు మ‌నసుల్ని క‌దిలించే ఉన్నాయ‌ని, ఇలాంటి క‌థ‌ల‌ను ఆద‌రిస్తున్న నిర్మాత‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని వ‌న‌మాలి అన్నారు. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ చాలా డిఫ‌రెంట్ గా రివ‌ర్స్ లో ప్లాన్ చేశామ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో సినిమాకు లేటుగా వెళ్లొద్ద‌ని డైరెక్ట‌ర్ ఫ‌ణీంద్ర ఈ సంద‌ర్భంగా ఆడియ‌న్స్ ను కోరాడు.

Tags:    
  • 8Vasantalu 
  • PhanindraNarshetti 
  • Ananthika 
  • MythriMovieMakers 
  • TeluguCinema 
  • EmotionalDrama 
  • NewTalent 
  • June20Release 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS