పీపుల్ మీడియా మైండ్ బ్లాక్ అయ్యే లిస్ట్..!
టాలీవుడ్ లో స్టార్ సినిమాలతో పాటు మీడియం రేంజ్.. కంటెంట్ ఉన్న సినిమాలకు లో బడ్జెట్ కేటాయిస్తూ తమ అభిరుచిని తెలియచేస్తూ వస్తున్న సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.;
టాలీవుడ్ లో స్టార్ సినిమాలతో పాటు మీడియం రేంజ్.. కంటెంట్ ఉన్న సినిమాలకు లో బడ్జెట్ కేటాయిస్తూ తమ అభిరుచిని తెలియచేస్తూ వస్తున్న సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. గత మూడు నాలుగేళ్ల నుంచి వరుస సినిమాలు చేస్తున్న ఈ ప్రొడక్షన్ కి రీసెంట్ గా వచ్చిన మిరాయ్ సక్సెస్ మంచి జోష్ అందించింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన మిరాయ్ సినిమాలో తేజ సజ్జ, మంచు మనోజ్ నటించారు. మిరాయ్ సినిమాతో సక్సెస్ ఖాతా తెరిచింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
నెక్స్ట్ రాబోతున్న సినిమాల లిస్ట్..
ఐతే ఈ సంస్థ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమాల లిస్ట్ లీక్ అయ్యింది. నెక్స్ట్ వెంటనే ఈ బ్యానర్ నుంచి సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా వస్తుంది. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేశారు. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఇక వచ్చే సంక్రాంతికి టార్గెట్ తో రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ కూడా ఈ బ్యానర్ లో నిర్మించిన సినిమా అవ్వడం విశేషం.
ఇదే కాకుండా అడివి శేష్ సూపర్ హిట్ సీక్వెల్ గూఢచారి 2, మోగ్లీ వస్తున్నాయి. ఇక మిరాయ్ సక్సెస్ అయ్యింది కాబట్టి మిరాయ్ 2 జైత్రాయ, తేజా సజ్జాతోనే జాంబి రెడ్డి సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వీటితో పాటు కన్నడ స్టార్ ధృవ సర్జతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ లిస్ట్ లోనే రణమండల, పినాక, మా కాళి, గరివిడి లక్ష్మి సినిమాలు ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా..
గోపీచంద్ మలినేని జాత్ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అవ్వడంతో జాత్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇక ఈ సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా కూడా లైన్ చేస్తున్నారట. సో ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 13 సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ ని శాసించాలని చూస్తుంది. స్టార్ సినిమాలతో పాటు మీడియం రేంజ్, లో బడ్జెట్ సినిమాలు కూడా ఈ బ్యానర్ నుంచి రాబోతున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ తను చేస్తున్న సినిమాల మీద పూర్తి కమిటెడ్ గా ఉన్నారు. సినిమా మీద ఎంత ఇష్టం తోనే ఆయన నిర్మాతగా మారగా.. ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఐతే ఇలాంటి నిర్మాణ సంస్థకు సూపర్ హిట్లు పడితే అంతకుమించిన సినిమాలు తెరకెక్కించే ఛాన్స్ ఉంటుంది.
పీపుల్ మీడియా నుంచి రాబోతున్న నెక్స్ట్ 13 సినిమాల లిస్ట్ ఇదే..
1.తెలుసు కదా
2.ది రాజా సాబ్
3.గూఢచారి 2
4.మోగ్లీ
5.మిరాయ్ 2
6.జాంబి రెడ్డి 2
7.ధృవ్ సర్జా మూవీ
8.రణమండల
9.పినాక
10.మా కాళి
11.గరివిడి లక్ష్మి
12.జాత్ 2
13.పవన్ కళ్యాణ్ తో మూవీ