'పెద్ది'కి నార్త్ ఫైట్.. ఆ సినిమాలతో జాగ్రత్త పడాల్సిందేనా?
ఇక్కడ అసలు సమస్య స్క్రీన్ కౌంట్. పోటీలో ఉన్న సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా, థియేటర్ల పంపకంలో సమస్యలు వస్తాయి.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను టార్గెట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో నార్త్ లో ఆయనకు పవర్ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో తర్వాతి సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు గేమ్ ఛేంజర్ వచ్చినా అది ఏ మాత్రం క్లిక్ కాలేదు. ఇక నెక్స్ట్ 'పెద్ది' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2026 మార్చి 27న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే చరణ్ కు బాలీవుడ్ లో దారి అంత సులువుగా కనిపించడం లేదు. అక్కడ బాక్సాఫీస్ దగ్గర క్లాష్ గట్టిగానే ఉండనున్నట్లు అర్ధమవుతుంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం హిందీ మార్కెట్ లో చరణ్ సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా కూడా మార్చి లోనే రానుంది. ఇది మార్చి 19 వస్తున్నప్పటికీ ఎంతో కొంత ఎఫెక్ట్ పడవచ్చు. కేజీఎఫ్ సిరీస్ తో యష్ కు నార్త్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇప్పుడు టాక్సిక్ కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, మాస్ ఆడియెన్స్ మొత్తం అటు వైపు మళ్లే ప్రమాదం ఉంది. ఇది చరణ్ ఓపెనింగ్స్ కు పెద్ద గండం.
మరోవైపు లోకల్ హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు. అజయ్ దేవగణ్ హిట్ ఫ్రాంచైజీ 'ఢమాల్ 4' కూడా అదే టైమ్ లో లైన్లో ఉంది. కామెడీ ఎంటర్టైనర్లకు నార్త్ లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఇలాంటి సినిమాలకే ఓటు వేస్తారు. దానికి తోడు రణ్ వీర్ సింగ్ కొత్త సినిమా 'ధురంధర్ 2' కూడా పోటీలో ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సీక్వెల్స్ తో పోటీ పడటం అంటే కత్తి మీద సాము లాంటిదే.
ఇక్కడ అసలు సమస్య స్క్రీన్ కౌంట్. పోటీలో ఉన్న సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా, థియేటర్ల పంపకంలో సమస్యలు వస్తాయి. మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్లు విడిపోతాయి. అప్పుడు 'పెద్ది'కి సోలో రిలీజ్ అడ్వాంటేజ్ మిస్ అవుతుంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ స్క్రీన్లు ఉండాలి. కానీ ఈ పోటీ వల్ల అది కష్టమయ్యేలా ఉంది.
అయితే రామ్ చరణ్ కు ఉన్న ఆర్ఆర్ఆర్ ఇమేజ్ ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్. రెహమాన్ మ్యూజిక్, భారీ బడ్జెట్ వంటి అంశాలు సినిమాకు క్రేజ్ తెస్తాయి. కానీ పోటీ సినిమాలు కూడా తక్కువవేమీ కాదు. ముఖ్యంగా యష్ లాంటి మాస్ హీరోతో క్లాష్ అంటే కలెక్షన్లలో కోత తప్పకపోవచ్చు. కంటెంట్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటేనే ఈ పోటీని తట్టుకుని నిలబడగలరు. ఏదేమైనా నార్త్ ఇండియాలో పాగా వేయాలంటే చరణ్ కు సరైన ప్లానింగ్ అవసరం. ప్రమోషన్స్ నుంచి రిలీజ్ డేట్ వరకు ప్రతిదీ పక్కాగా ఉండాలి. ఈ పోటీని దాటుకుని 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.