లెగసీ కంటిన్యూస్: నాటి తరం గోల్డెన్ లెజెండ్స్.. నేటి తరం సెన్సేషన్స్!
తెలుగు సినిమా చరిత్రలో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' ఒక ఎవర్‌గ్రీన్ క్లాసిక్. నాాడు చిరంజీవి, శ్రీదేవి, కమల్ హాసన్ బాక్సాఫీస్‌ను ఏలారు.
తెలుగు సినిమా చరిత్రలో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' ఒక ఎవర్‌గ్రీన్ క్లాసిక్. నాాడు చిరంజీవి, శ్రీదేవి, కమల్ హాసన్ బాక్సాఫీస్‌ను ఏలారు. ఇప్పుడు ముప్పై ఏళ్ల తర్వాత, వారి వారసులు రామ్ చరణ్, జాన్వీ కపూర్, శృతి హాసన్ ఒకే ఫ్రేమ్‌లోకి రాబోతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా ద్వారా ఈ అరుదైన మ్యాజిక్ మళ్లీ రిపీట్ కాబోతోంది. కాలం రాసిన ఈ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ విశేషాలు చూద్దాం ..
నాటి మ్యాజిక్.. నేటి క్రేజీ కాంబో:
ఒకప్పుడు చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవి స్క్రీన్ పైన కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. ఒకరికొకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ ఇండస్ట్రీని నడిపించారు. ఇక ఇప్పుడు కరెక్ట్‌గా అదే లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు వారి పిల్లలు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే, కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురూ ఒకే సినిమాలో ఉండడం నిజంగా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే విషయమే.
అదిరిపోయిన హల్లల్లల్లో హల్లో.. సాంగ్:
ఈ క్రేజీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నుండి తాజాగా హల్లల్లల్లో హల్లో..ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఏఆర్ రెహమాన్ మాస్ బీట్స్‌కు, అనంత్ శ్రీరామ్ అదిరిపోయే లిరిక్స్ అందించారు. ఇక సింగర్ రక్షిత సురేష్ వాయిస్ ఈ పాటకు ఎనర్జీని ఇచ్చింది. జానీ మాస్టర్ స్టెప్స్ లో రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ.. అటు జాన్వీ, ఇటు శృతి హాసన్‌లతో కలిసి వేసిన స్టెప్పులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఎవడు’ సినిమా తర్వాత చరణ్, శృతి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం విశేషం.
స్క్రీన్ పైన నెక్స్ట్ లెవెల్ విజువల్స్:
ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాతల, తండ్రుల లెగసీని కాపాడుకుంటూ, గ్లోబల్ వైడ్‌గా దూసుకుపోతున్న ఈ న్యూ జనరేషన్ స్టార్స్ వెండితెరపై ఏ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో అని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక నాటి తరం గోల్డెన్ మెమొరీస్ గుర్తు చేస్తూ.. నేటి తరం వండర్స్ విజువల్స్‌తో వస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
తల్లిదండ్రుల నుంచి వచ్చిన నటనను, క్రేజ్‌ను ఈ న్యూ జనరేషన్ స్టార్స్ పర్ఫెక్ట్‌గా కంటిన్యూ చేస్తున్నారు. ‘పెద్ది’ సినిమా కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, రెండు తరాల సినిమా బంధానికి ఒక అందమైన ప్రతీక. ఈ జూన్ 4న థియేటర్లలో ‘న్యూ ఎరా’ వైబ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడటానికి ఫ్యాన్స్ అంతా రెడీ అయిపోతున్నారు..