పెద్ది: సిక్స్ కొట్టాల్సిన టైమొచ్చింది
అందుకే ఇప్పుడు అందరి చూపు ‘పెద్ది ట్రైలర్’ మీద ఉంది. బుచ్చిబాబు ఇంటర్వ్యూలు గ్రౌండ్ ప్రిపేర్ చేశాయి.
బుచ్చిబాబు సానా ఇంటర్వ్యూలు ఇటీవల సోషల్ మీడియా టైమ్‌లైన్‌ని నింపేశాయి. ‘పెద్ది’ సినిమా దర్శకుడిగా ఆయన మాట్లాడిన ప్రతి క్లిప్ వైరల్ అవుతోంది. హడావుడి లేకుండా, సూటిగా, నిజాయితీగా మాట్లాడే అతని స్టైల్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా కంటెంట్ మీద ఉన్న క్లారిటీ, కమర్షియల్ లెక్కలు పక్కన పెట్టి కథను నమ్ముకున్న తీరు జనాలకు కనెక్ట్ అయ్యింది.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బుచ్చిబాబు ఇంటర్వ్యూలు పర్సనల్ బ్రాండ్‌కి ప్లస్ అయ్యాయి కానీ, ‘పెద్ది’ థియేట్రికల్ హైప్‌కి డైరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ అవ్వడం లేదు. కారణం ఒక్కటే. ఆయన మాటల మనిషి కాదు. అనవసర డైలాగులు, బిల్డప్‌లు లేవు. మంచి సినిమా తీశాం, చూడండి అనే మోడ్‌లోనే ఉంటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు ఇంటర్వ్యూలతోనే క్యూరియాసిటీ పెంచుతారు. బుచ్చిబాబు మాత్రం ఆ పని చేయడు.
ఇది ప్లస్సా, మైనస్సా అంటే రెండూ. ఇప్పటి ప్రేక్షకుడు దర్శకుడి మాటలు విని థియేటర్‌కి రాడు. కంటెంట్ చూడాలి. అది టీజర్, ట్రైలర్, పాటల్లో కనిపించాలి. బుచ్చిబాబు ఇంటర్వ్యూలు ‘ఉప్పెన’ తర్వాత ఆయన మీద ఉన్న నమ్మకాన్ని పెంచాయి. కానీ ‘పెద్ది’ మీద బజ్ క్రియేట్ చేయాలంటే విజువల్ గ్రాండియర్ కావాలి. రామ్ చరణ్ మాస్ లుక్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, విలేజ్ బ్యాక్‌డ్రాప్.. ఇవన్నీ ట్రైలర్‌లోనే చూపించాలి.
అందుకే ఇప్పుడు అందరి చూపు ‘పెద్ది ట్రైలర్’ మీద ఉంది. బుచ్చిబాబు ఇంటర్వ్యూలు గ్రౌండ్ ప్రిపేర్ చేశాయి. పిచ్ రెడీ అయ్యింది. ఇప్పుడు సిక్స్ కొట్టాల్సింది ట్రైలర్. ఫస్ట్ గ్లింప్స్‌తో వచ్చిన అంచనాలను ట్రైలర్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తేనే ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. లేదంటే మంచి ఇంటర్వ్యూలు ఇచ్చాడు అనే మాటతోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది.. సైలెంట్‌గా పని చేసే దర్శకుల సినిమాలు థియేటర్‌లో మాట్లాడతాయి. ‘రంగస్థలం’ ముందు సుకుమార్ ఇంటర్వ్యూలు తక్కువే. ‘కేజీఎఫ్’ ముందు ప్రశాంత్ నీల్ కూడా అంతే. బుచ్చిబాబు కూడా ఆ కోవకు చెందినవాడు. ఆయన స్ట్రెంత్ మాటలు కాదు, మేకింగ్. కాబట్టి ట్రైలర్ వచ్చేదాకా ఈ ఇంటర్వ్యూ హైప్‌ని బ్రిడ్జ్‌లా వాడుకోవాలి. ఏదేమైనా బుచ్చిబాబు చేస్తున్నది సరైన స్ట్రాటజీనే. అనవసర హంగామా లేకుండా సినిమా మీద ఫోకస్ పెట్టాడు.
ఇంటర్వ్యూలతో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇప్పుడు ‘పెద్ది’ ట్రైలర్ వచ్చి కమర్షియల్ హైప్ తెచ్చిపెట్టాలి. అది జరిగితే, సైలెంట్‌గా ఉన్న దర్శకుడు బాక్సాఫీస్‌ని షేక్ చేసినట్టే. పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ కూడా ఉన్నారు. ఇక మరికొన్ని రోజుల్లో వరుసగా ఈవెంట్స్ తో పాన్ ఇండియా లెవెల్లో పెద్ది సౌండ్ పెంచనున్నాడు.