• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓజీతో సుజిత్ యుద్ధమే...

ఓజీతో సుజిత్ యుద్ధమే చేయాలేమో?

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ

By - Tupaki Desk
Update: 2023-08-03 05:58 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలై ఐదు షెడ్యూల్స్ వరకు కంప్లీట్ అయ్యాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో దానయ్య చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది.

బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లాంటి కీలక నటులు కూడా ఈ సినిమా షూటింగ్ లో భాగమయ్యారు. వారాహి యాత్రకి ముందు పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ చేశారు. అయితే యాత్ర మొదలైన తర్వాత మరల షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం రాజకీయ కార్యాచరణలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుజిత్ కి ఓజీ మూవీతో కొత్త టెన్షన్ వచ్చి పడింది.

ఓజీ మూవీ గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో నడిచే కథాంశంతో ఉండబోతోంది. గతంలో పవన్ కళ్యాణ్ పంజా, బాలు సినిమాలు గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ తోనే వచ్చాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. లవ్ ట్రాక్ మిక్స్ చేయడం కూడా ఆ సినిమాల ఫెయిల్యూర్ కి ఒక కారణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం సుజిత్ మాత్రం కంప్లీట్ గ్యాంగ్ స్టార్ కథగానే ఓజీని ఆవిష్కరిస్తునన్నారు.

ఇలాంటి కథలకి ముఖ్యంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ చాలా అవసరం ఉంటుంది. అవి ఉన్నప్పుడే మూవీకి మంచి బజ్ వస్తుంది. ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అవుతూ ఉండటంతో ఓజీకి ఆశించిన స్థాయిలో టైం ఇవ్వలేకపోతున్నారు. సుజిత్ మాత్రం ఎట్టి పరిస్థితిలో మూవీ కంప్లీట్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితిలో పవన్ సహకరించకుండా షూటింగ్ ఎలా ఫినిష్ చేస్తాడు. అలాగే భారీ యాక్షన్ బ్లాక్స్ ఎలా తెరకెక్కిస్తాడు అనేది ప్రశ్నగా ఉంది. అయితే టెక్నాలజీ పెరిగిన తర్వాత స్టూడియో దాటకుండానే ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ అయిన కూడా గ్రీన్ మ్యాట్ మీట్ కంప్లీట్ చేసే సదుపాయం ఉంది. మరి అలాంటి ప్రయత్నం ఏమైనా ఓజీ మూవీ కోసం చేస్తారేమో చూడాలి.

Tags:    
  • OGmovie 
  • Pawankalyan 
  • Sujeeth 
  • Priyankaarulmohan 
  • Arjundas 
  • Shriyareddy 
  • Originalgangstar 
  • Pawanog 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS