• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓజీ : కలుద్దాం త్వరలో...!

ఓజీ : కలుద్దాం త్వరలో...!

| పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన మధ్యలో వదిలేసిన ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల గురించి ప్రధాన చర్చ జరుగుతూనే ఉంది

By - Tupaki Desk
Update: 2024-08-20 08:57 GMT

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన మధ్యలో వదిలేసిన ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల గురించి ప్రధాన చర్చ జరుగుతూనే ఉంది. ఆ సినిమాల నిర్మాతల శ్రేయస్సు కోసం, వారిని ఆర్థికంగా నష్టపరచకూడదు అనే ఉద్దేశ్యంతో పవన్‌ కళ్యాణ్ ఆ సినిమాలను పూర్తి చేస్తాను అంటూ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. పదవి చేపట్టిన వెంటనే షూటింగ్‌ అంటూ వెళ్తే ప్రజలు విమర్శిస్తారనే ఉద్దేశ్యం తో పాటు, చాలా బిజీగా ఉండటం వల్ల ఇప్పటి వరకు షూటింగ్స్ కు జాయిన్ అవ్వలేదు.

త్వరలోనే ఓజీ మరియు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్స్ కు పవన్ హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధ్యం అయినంత తక్కువ రోజుల్లో సినిమా షూటింగ్‌ పూర్తి చేసే విధంగా ఓజీ దర్శకుడు సాహో సుజీత్‌ ప్లాన్ చేస్తున్నాడట. పైగా హైదరాబాద్‌ లో కాకుండా విజయవాడ మరియు గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా షూటింగ్‌ ను ప్లాన్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. పవన్‌ కళ్యాణ్ ఇతర సినిమాలతో పోల్చితే ఓజీ సినిమా పై ఎక్కువ ఆసక్తి తో ఉన్నాడు. చాలా కాలం గా మాఫియా డాన్‌ పాత్ర తో వచ్చేందుకు ఉవ్విల్లూరుతున్న పవన్‌ ఓజీ తో ఫ్యాన్స్ కి కన్నుల విందు చేయబోతున్నాడు.

పవన్‌ కళ్యాణ్‌ ఓజీ సినిమా గురించి సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంగీత దర్శకుడు థమన్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా ఓజీ వార్తల్లో నిలిచింది. సోషల్‌ మీడియా ద్వారా పవన్‌ కళ్యాణ్ అభిమాని ఒకరు థమన్ మరియు సుజీత్‌ ను ఓజీ నుంచి ఏదో ఒక స్పెషల్‌ అప్‌డేట్‌ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అందుకు థమన్‌ నుంచి సాలిడ్‌ స్పందన వచ్చింది. అతి పెద్ద వెండితెర సందడి కి చిన్న సైలెన్స్ కొనసాగుతోంది. ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్ కచ్చితంగా కలుద్దాం త్వరలో అంటూ ట్వీట్‌ చేసి హైప్ క్రియేట్‌ చేశాడు.

పవన్‌ కళ్యాణ్ ను చాలా డిఫరెంట్‌ రోల్‌ లో దర్శకుడు సుజీత్‌ చూపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తోంది. హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేయడం ద్వారా సినిమా పై మరింత ఆసక్తి పెంచారు. హీరో మాఫియా డాన్ కాగా, హీరోయిన్‌ డాక్టర్‌. ఈ కాంబినేషన్ సినిమా కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్రలో నటిస్తుండగా శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లు సినిమాలో విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారట.

Tags:    
  • Thaman 
  • Tollywood 
  • OGmovie 
  • Pawankalyan 
  • Sujeeth 
  • Thamanmusic 
  • Pawankalyanog 
  • Filmindustry 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS