• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG సుజిత్.. ఒక్కదానికే...

OG సుజిత్.. ఒక్కదానికే దేవుడయ్యాడు..!

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ రోజున ఆయన ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్ దక్కింది.

By - Tupaki Desk
Update: 2023-09-02 16:06 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ రోజున ఆయన ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్ దక్కింది. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ఓజీ( ఓన్లీ గ్యాంగ్ స్టార్) ఈ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు. ఇప్పుడు ఆ గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ర‌న్ రాజా ర‌న్‌, సాహో వంటి చిత్రాలు అందించిన సుజిత్ ఈ సినిమాలో పవన్ ని గ్యాంగ్ స్టార్ గా చూపిస్తున్నారు. దాదాపు పవన్ చాలా కాలంగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. కాగా, ఆయన నుంచి వస్తున్న ఒరిజినల్ మూవీ కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ మూవీపై ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా సుజిత్ విడుదల చేసిన గ్లింప్స్ ఉన్నాయి.

101 సెకన్ల నిడివితో గ్లింప్స్ సాగింది. ఈ గ్లింప్స్ కి అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌‌ అందించడం విశేషం. ఆయన వాయిస్ ఓవర్ తో మొదలైంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాన్ గుర్తుందా. అది మ‌ట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు న‌రికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుపాన్ కడగకలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే..’ అంటూ సూపర్ ఎలివేషన్ ఇచ్చారు.

ఆ తర్వాత పవన్ లుక్ చూపించారు. పవన్ లుక్ చాలా స్టైలిష్ గా, కొత్తగా ఉంది. అందుకే, ఈ గ్లింప్స్ చూసి పూనకాలు వచ్చినట్లు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. సినిమా హిట్ అంటూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టిలో సుజిత్ దేవుడైపోయాడు. ఒక్క గ్లింప్స్ కే ఇలా అయిపోతున్నారంటే, సినిమా చేస్తే ఇంకేమైపోతారో.

అయితే, చిన్న వీడియో చూసి సినిమాను అంచనా వేయలేం. సినిమా బాగుందా ఒకే. కానీ, ఏదైనా తేడా కొట్టి, సినిమా పోయిందా ఇదే ప్యాన్స్ మళ్లీ ఇదే డైరెక్టర్ ని విమర్శించడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏఢాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    
  • Pawankalyan 
  • Sujeeth 
  • OGMovie 
  • Tollywood 
  • Movienews 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS