• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవర్ స్టార్ ఈజ్ బ్యాక్..!

పవర్ స్టార్ ఈజ్ బ్యాక్..!

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-13 10:46 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తనకు ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేనానిగా తన సేనని సంతృప్తి పరుస్తున్నా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ గా మాత్రం కొందరు అసంతృప్తిగా ఉన్నారు. అలా ఎందుకు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్స్ మీద మూడు సినిమాలు ఉంచారు. హరి హర వీరమల్లు సినిమా అయితే దాదాపు 4 ఏళ్లుగా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ దాదాపు ఆశలు వదులుకున్నారు.

ఇక హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టం అనేలా ఉంది. పవర్ స్టార్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఆ సినిమా పూర్తి చేస్తానని చెబుతున్నాడు హరీష్ శంకర్. ఇదే కాకుండా సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా కూడా సగానికి పైగా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు పవర్ స్టార్.

అసలైతే ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని అనుకున్నా గెలిచాక వెంటనే సినిమాలంటే ప్రత్యర్ధులు విమర్శిస్తారని చెప్పి పవన్ సినిమాలు సెకండ్ పాలిటిక్స్ ఫస్ట్ అని చెబుతున్నాడు. ఐతే ఓజీ కోసం కూడా ఒక నెల రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది. అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ తను చేస్తున్న సినిమాలకు డేట్స్ ఇస్తున్నాడని టాక్. ఐతే లేటెస్ట్ గా పవన్ లుక్ చూసి పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ ఓజీ లుక్ తో కనిపిస్తున్నారని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

రీసెంట్ గా శ్రీహరి కోట షార్ కేంద్రంలో సైంటిస్ట్ లతో చర్చించారు పవన్ కళ్యాణ్. ఐతే ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ లుక్ చూసి ఓజీ కోసం పవర్ స్టార్ రెడీ అవుతున్నాడని. త్వరలోనే సినిమా మొదలవుతుందని హడావిడి చేయడం మొదలు పెట్టారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ ఫోటోలతో ఖుషి అవుతున్నారు. ఫ్యాన్స్ అంతా కూడా పవర్ స్టార్ మళ్లీ ఎప్పుడు సెట్స్ లోకి వస్తారా అని ఎదురుచూస్తున్నారు. మరి అక్టోబర్ కల్లా అయినా పవన్ కళ్యాణ్ తన టైం ను సినిమాలకు కేటాయిస్తారా లేదా అన్నది చూడాలి.

శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. షార్ కేంద్రం శాస్త్రవేత్తలు ఘన స్వాగతం పలికారు. @PawanKalyan @APDeputyCMO pic.twitter.com/Ek58KxJLzx

— JanaSena Party (@JanaSenaParty) August 13, 2024
Tags:    
  • Pawankalyan 
  • Janasena 
  • Deputychiefminister 
  • Sriharikotta 
  • Nellore 
  • Og 
  • Hariharaveeramallu 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS