అకీరా కొణిదెల కాదు..అకీనా దేశాయ్!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ -రేణు దేశాయ్ భార్య భ‌ర్త‌లుగా విడిపోయినా! స్నేహితులుగా క‌లిసే ఉన్నారు.

Update: 2024-04-27 09:30 GMT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ -రేణు దేశాయ్ భార్య భ‌ర్త‌లుగా విడిపోయినా! స్నేహితులుగా క‌లిసే ఉన్నారు. పిల్ల‌లు అకీరానంద న్..ఆద్య‌ల భ‌విష్య‌త్ ని దృష్టి లో పెట్టుకుని త‌ల్లిందండ్రుల ప్రేమ‌ను పంచుతూనే ఉన్నారు. ఎలాంటి పండ‌గ‌లు వ‌చ్చినా పిల్ల‌లు ఇద్ద‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ద్ద‌కు వ‌స్తుంటారు. అక్క‌డ నుంచి చిరంజీవి..రామ్ చ‌ర‌ణ్ తోనూ క‌లుస్తుంటారు. మెగా ఫ్యామిలీలో ఎలాంటి వేడుక చోటు చేసుకున్నా అక్క‌డ క‌చ్చితంగా అకీరా..ఆద్య‌లు క‌నిపిస్తుంటారు. పిల్ల‌ల‌కు సంబంధించిన అన్ని ర‌కాల బాధ్య‌త‌ల్ని ప‌వ‌న్ నెర‌వేరుస్తున్నారు.

తాజాగా అకీరా..ఆద్యాల ముందు `కొణిదెల` అని లేక‌పోవ‌డంతో ఇంటిపేరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.` కొణిదెల` స్థానంలో `దేశాయ్` అని ఉంద‌ని తాజాగా ప‌వ‌న్ స‌మ‌ర్పించిన అపిడ‌విట్ లో ఉంది. ఏపీ ఎన్నిక‌ల్లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి అందించిన వివ‌రాల్లో అకీరా దేశాయ్..ఆద్య దేశాయ్ అని పిల్ల‌ల పేర్లు ఉన్నాయి. ఇది చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

అకీరా నందన్ కొణిదెల‌..ఆద్య కొణిదెల అని ఉండాలి క‌దా? త‌ల్లి ఇంటి పేరును జోడించ‌డం ఏంట‌ని? సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ వాస్త‌వానికి భార్య‌భ‌ర్త‌లు గా పిల్ల‌ల ఇంటిపేరు విష‌యంలో ఎలాంటి ష‌ర‌త్తులు లేవు. తండ్రి ఇంటిపేరైనా కొన‌సాగించ వ‌చ్చు? లేదా త‌ల్లి ఇంటి పేరునైనా కొన‌సాగించ‌వ‌చ్చు? రేణు దేశాయ్ పిల్ల‌ల స‌ర్ నేమ్ విష‌యంలో దేశాయ్ అనే తొలి నుంచి కొన‌సాగిస్తున్నారు.

ప‌వ‌న్ తో విడిపోయిన ద‌గ్గ‌ర నుంచి పిల్ల‌లు ఇద్ద‌రు త‌ల్లివ‌ద్ద‌నే పెరిగారు. ప్ర‌స్తుతం ఆమె ద‌గ్గ‌రే ఉంటున్నారు. కాబ‌ట్టి త‌న తండ్రి ఇంటి పేరునే రేణుదేశాయ్ ఛాయిస్ గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అకీరా కొణిదెల వార‌సుడు... అంటూ రేణు దేశాయ్ చాలా మీడియా ఇంట‌ర్వ్యూల్లో రివీల్ చేసారు. ఇంటిపేర్లు వేరైనప్ప‌టికీ ఆ ఇద్ద‌రు కొణిదెల వార‌సులే అంటూ మ‌రికొంత మంది అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. అలాగే పిల్ల‌లిద్ద‌రి పేరు మీద ప‌వ‌న్ ఎలాంటి ఆస్తులు కూడా పెట్టిన‌ట్లు అఫిడ‌విట్ లో లేదు. ఐదేళ్ల సంపాద‌న‌.. అప్పులు.. పార్టీ కి వ‌చ్చిన విరాళాలు త‌ప్ప ఇంకే క‌నిపించ‌లేదు.

Tags:    

Similar News