పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. రాశీ ఖన్నా కీలక అప్డేట్

పవన్ కళ్యాణ్ తో దిగిన సెల్ఫీ షేర్ చేసి రాశీ ఖన్నా.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన పవర్ స్టార్ షూటింగ్ పూర్తి అయిందని తెలిపింది.;

Update: 2025-09-14 13:54 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఇటు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వగా.. మరికొద్ది రోజుల్లో ఓజీ మూవీ విడుదల అవ్వనుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది.

రీసెంట్ గా ఓజీ డబ్బింగ్ ను స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ఆ వర్క్ జరుగుతోంది. అదే సమయంలో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే రీసెంట్ గా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను ఈ వారంలోనే ముగించేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనుకున్నట్లే పవన్ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఆ విషయాన్ని అఫీషియల్ గా రాశీ ఖన్నా ఖరారు చేసింది.

పవన్ కళ్యాణ్ తో దిగిన సెల్ఫీ షేర్ చేసి రాశీ ఖన్నా.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన పవర్ స్టార్ షూటింగ్ పూర్తి అయిందని తెలిపింది. మూవీలో ఆయనతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమని కొనియాడింది. ఇది ఎప్పటికీ ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ గా మారింది.

అదే సమయంలో పవన్, రాశీ సెల్ఫీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిక్ బాగుందని నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు కంప్లీట్ పెడుతున్నారు. అయితే ఉస్తాద్ లో పవన్ పార్ట్ పూర్తవ్వగా.. ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అది కూడా కంప్లీట్ అవ్వనుందని సమాచారం.

ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి.. 2026లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అయితే బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్‌ సింగ్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్ - హరీష్ శంకర్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మూవీలో పవన్‌ మరోసారి పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News