ప‌వ‌న్ పూర్తిచేసే వ‌ర‌కూ చెప్ప‌రా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` చిత్రీక‌ర‌ణ పూర్తిచేయ‌డంతో ఈ సినిమా స‌రైన రిలీజ్ తేదీ కోసం మేక‌ర్స్ సెర్చ్ చేస్తున్నారు.;

Update: 2025-05-14 09:23 GMT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` చిత్రీక‌ర‌ణ పూర్తిచేయ‌డంతో ఈ సినిమా స‌రైన రిలీజ్ తేదీ కోసం మేక‌ర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఆ తేదీ లాక్ అవ్వ‌గానే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప‌వ‌న్ డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేయాలి. అందుకు పెద్ద‌గా స‌మ‌యం కేటాయించాల్సిన ప‌నిలేదు కాబ‌ట్టి యూనిట్ రిలాక్స్ గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేసుకుంటుంది. దీంతో `ఓజీ`కి కూడా లైన్ క్లియ‌ర్ అయింది.

ఈ సినిమా పెండింగ్ షూటింగ్ కూడా ప‌వ‌న్ పూర్తి చేసేస్తార‌ని ఎదురు చూస్తోన్న త‌రుణంలో ఆయ‌న షూట్ కు హాజ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ పోర్ష‌న్ కి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు షూట్ ఉంటుంది? అన్న‌ది మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. కానీ ప‌వ‌న్ కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతుంద‌న్న‌ది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో రిలీజ్ తేదీపై `ఓజీ` టీమ్ సైలెంట్ గా ఉంది. ప‌వ‌న్ పోర్ష‌న్ పూర్త‌య్యేంత‌వ‌ర‌కూ రిలీజ్ తేదీని ప్ర‌క‌టించ కూడ‌ద‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

ఎందుకంటే ప‌వ‌న్ ఎప్పుడు షూటింగ్ కి వ‌స్తారో? ఎప్పుడు బ్రేక్ వేస్తారో? తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ లో రిలీజ్ అనుకుంటున్నా తేదిని మాత్రం రివీల్ చేయ‌కుండా హోల్డ్ లో పెట్టారు. ఒక‌వేళ షూటింగ్ అనుకున్న స‌మ‌యంలో పూర్త‌యితే ప‌ర్వాలేదు. సెప్టెంబ‌ర్ లో మంచి ముహూర్తం చూసి రిలీజ్ చేస్తారు. ఒక‌వేళ చిత్రీక‌ర‌ణ పూర్తి కాక‌పోతే మ‌ళ్లీ భంగ పాటు త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ప‌లుమార్లు రిలీజ్ తేదీలు ప్ర‌కటించి వాయిదా వేసుకున్న సంగ‌తి తెలిసిందే.

మళ్లీ అలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌కూడ‌ద‌ని పీకే సెట్స్ కి వెళ్లినా? అంతా కామ్ గా ఉన్నారు. ప‌వ‌న్ రీజాయిన్ అయినా మేక‌ర్స్ ఎలాంటి హ‌డావుడి లేకుండా సైలెంట్ గా ఉన్నారు. పీకే జాయిన్ అయ్యారు కాబ‌ట్టి సెట్స్ నుంచి లీకులు ఎలాగూ వ‌స్తాయి. అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News