ఏఎం రత్నంకు ఏపీలో కొత్త బాధ్యతలు.. పవన్ ప్రతిపాదన
ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.;
ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. జులై 24న మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. పవన్ సందడి చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
"సినిమా ఇండస్ట్రీలో ఎవరినీ తప్పుపట్టలేం. నిర్మాత రత్నం గారు వీరమల్లు విషయంలో నలిగిపోయారు. అది బాధనిపించింది. మీకు చెప్పాలని అనిపించి చెబుతున్నా. కొన్ని కారణాల వల్ల క్రిష్ తప్పుకున్నారు. జ్యోతి కృష్ణ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్. సినిమా వస్తుందా లేదా అని నీరసపడితే ప్రాణ వాయువు ఇచ్చారు కీరవాణి. సినిమాను చివరి దాకా నేనెప్పుడూ నమ్మను" అని తెలిపారు.
"మూవీ క్వాలిటీపై ఫోకస్ పెడతా. కానీ ఇప్పుడు అవసరం. నిర్మాత కనుమరగవ్వకూడదు. ఆయన అండగా నిలబడాలి. ప్రత్యర్థులు తిడుతున్నా.. కూడా వచ్చా. నాకు సినిమా అన్నం పెట్టింది. సినిమా నాకు ప్రాణవాయువు. వేరే వాళ్ల మూవీస్ లాగా నా చిత్రాలు బిజినెస్ కాదు. నేను అంతగా ఫోకస్ పెట్టలేదు. నేను హీరోల్లో ఒకరిని. ఇది అందరి పరిశ్రమ అని కోరుకుంటా" అని చెప్పారు
"వీరమల్లు అనాథ చిత్రం కాదు. అందరం ఉన్నాం. ఎవరేమన్నా రత్నం గారు మౌనంగా ఉంటారు. ఏ ఇబ్బందులు పెట్టినా ఏం అనరు. ఆ మౌనమే నన్ను ఇప్పుడు రప్పించింది. ఆయన కష్టాన్ని ఇప్పుడు చెప్పాలనిపించింది. ప్రెస్ మీట్ కోసం ముఖ్య అంశం.. రత్నం గారి మంచితనం కోసం చెప్పడమే. సినిమా కోసం స్టార్ క్యాస్టింగ్ ను తీసుకొచ్చారు" అని తెలిపారు.
"బాబీ డియోల్ గారు అద్భుతంగా నటించారు. నేను పొద్దున్న టైమ్ లో రెండు గంటలు షూటింగ్ చేసేవాడిని. నా ఆఫీస్ దగ్గర్లో షూట్ చేశారు. ఫైనల్ కాపీ చూస్తే అక్కడే చేశారా అని అనిపిస్తుంది. జ్యోతి కృష్ణ ప్రతీ సీన్ కూడా వివరించారు. మంచి సత్తా ఉన్న ఆయనకు మనోజ్ కూడా తోడయ్యారు. రత్నం గారు తోడ్పాటుతో అద్భుతమైన సినిమాను తీశారు" అని పేర్కొన్నారు.
"సుస్వాగతం సినిమాలో బస్ పై డ్యాన్స్ చేయించారు. చాలా ఇబ్బంది పడ్డా. సాంగ్ కు నాకు అనుకూలంగా డ్యాన్స్ చేశా. యాక్షన్ సీన్స్ లో సహజంగా చేయాలనుకుంటా. క్లైమాక్స్ చేసినప్పుడు తాను తర్వాత సినిమాలు చేస్తానో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు బెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు రత్నం గారిని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రతిపాదించా"
"టాలీవుడ్ వంటి పదాలు వాడితే నచ్చదు. మంచి టాలెంట్ మన దగ్గర ఉంది. హాలీవుడ్ కమిట్మెంట్ ను నేర్చుకోవాలి. ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ తెలుసుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమ వల్ల భారతీయ పరిశ్రమకు మంచి జరగాలి. అందుకే ఆయన పేరు ప్రతిపాదించా. రిలీజ్ కు ముందు వరుస ఇంటర్వ్యూలు ఇస్తాను. సినిమా ప్రతి ప్రేక్షకుడికి మంచి అనుభూతి ఇస్తుంది" అని హామీ ఇచ్చారు పవన్.