ప‌వ‌న్‌క‌ల్యాణ్ 'ఉస్తాద్..' కోసం రంగంలోకి దిగేనా?

ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్‌ని పూర్తి చేయ‌డ‌మే కాకుండా దాని కోసం రంగంలోకి దిగి అందిరిని ఆశ్చ‌ర్య ప‌రిచారు.;

Update: 2025-11-18 11:30 GMT

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ ఫుల్ జోష్‌తో ఉన్నారు. అదే జోష్‌తో వ‌రుస‌గా పెండింగ్‌లో ఉన్న సినిమాల‌ని చ‌క చక పూర్తి చేస్తూ మునుపెన్న‌డూ లేనంత‌గా అభిమానుల్లో జోష్ నింపుతూ స‌రికొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నారు. ఓ ప‌క్క ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే మ‌రో ప‌క్క సినిమాలు వ‌రుస‌గా పూర్తి చేస్తున్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` షూటింగ్‌ని పూర్తి చేయ‌డ‌మే కాకుండా దాని కోసం రంగంలోకి దిగి అందిరిని ఆశ్చ‌ర్య ప‌రిచారు.

మూవీ ప్ర‌మోష‌న్స్‌కు ఆమ‌డ దూరం ఉండే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` ప్ర‌మోష‌న్స్‌ని త‌న భూజ‌ల‌కెత్తుకుని ఎంత వ‌ర‌కు ప్ర‌మోట్ చేయాలో అంత‌వ‌ర‌కు చేసి ప‌వ‌న్ ఇలా కూడా చేస్తాడా? అని అంతా అవాక్క‌య్యేలా చేశారు. ఫ‌లితం ఎలా ఉన్నా ప్రాజెక్ట్ డిలే అయింది కాబ‌ట్టి నిర్మాత ఏ.ఎం.ర‌త్నం న‌ష్ట‌పోకూడ‌ద‌ని త‌న వంతు ఏ మేర‌కు స‌హ‌య స‌హ‌కారాలు అందించాలో అంత వ‌ర‌కు చేసి సినిమాని ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లారు.

ఇదే పంథాను `ఓజీ`కి కూడా అనుస‌రించి మ‌రోసారి అందరిని ఆశ్చ‌ర్య‌పరిచారు ప‌వ‌న్‌. సుజీత్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్‌తో నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 25న భారీ స్థాయిలో విడుద‌లై ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లోనే స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ దాదాపుగా రూ. 300 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ప‌వ‌న్ స్టామినాని నిరూపించింది. దీని త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న మూవీ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట‌ర్‌.

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ చిత్రాల త‌ర‌హాలో ఆల‌స్యం అవుతూ వ‌చ్చిన ఈ ప్రాజెక్ట్ ఎట్ట‌కేల‌కు పూర్త‌యింది. ప‌వ‌న్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్త‌యింది. బ్యాలెన్స్ వ‌ర్క్ పూర్తి కావాల్సి వుంది. `గ‌బ్బ‌ర్‌సింగ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత హ‌రీష్ శంక‌ర్‌, ప‌వ‌న్‌ల క‌ల‌యిక‌లో రానున్న సినిమా కాబ‌ట్టి `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`పై భారీ అంచ‌నాలున్నాయి. డిసెంబ‌ర్ నుంచి ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాల‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నాడు. ఫస్ట్ సింగిల్‌ని డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్నామ‌ని రీసెంట్‌గా జ‌రిగిన `12ఏ రైల్వేకాల‌నీ` మూవీ ఈవెంట్‌లో వెల్ల‌డించారు.

వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ చిత్రాల ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోని ఫ్యాన్స్‌లో జోష్ పెంచిన ప‌వ‌న్ క‌ల్యాణ్ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` మూవీ ప్ర‌మోష‌న్స్‌లోనూ పాల్గొంటారా? అంత టైమ్ కేటాయిస్తారా? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫ్యాన్స్ కూడా ప‌వ‌న్ `ఉస్తాద్‌` ప్ర‌మోష‌న్స్‌ని కూడా ముందుండి న‌డిపిస్తారా? లేక టీమ్‌కే వ‌దిలేస్తారా? అని చ‌ర్చించుకుంటున్నారు. ప‌వ‌న్ వ‌స్తే వ‌చ్చే మైలేజీ వేరుగ ఉంటుంద‌ని, త‌ను ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొనాల‌ని అంతా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అంతా ఆశ‌ప‌డుతున్న‌ట్టే `ఉస్తాద్‌..` కోసం ప‌వ‌న్ రంగంలోకి దిగుతాడా? అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News