క్రేజీ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ ప‌వర్‌ఫుల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రాజ‌కీయాల‌లో బిజీగా ఉంటూనే సినిమాల‌కు టైమ్ కేటాయిస్తున్నారు.;

Update: 2026-03-23 08:29 GMT

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రాజ‌కీయాల‌లో బిజీగా ఉంటూనే సినిమాల‌కు టైమ్ కేటాయిస్తున్నారు. ఒక్కో సినిమాకు ప‌ర్‌ఫెక్ట్ వ‌ర్కింగ్ డేస్‌ని సెట్ చేసుకుని అటు పాలిటిక్స్‌ని, ఇటు సినిమాల‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు. సినిమాల కోసం స‌రికొత్త ఫార్ములాని ఫాలో అవుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అదే ప్లానింగ్‌తో ఇటీవ‌ల `ఓజీ`, హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రూపొందిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` వంటి సినిమాల‌ని పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లైన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటోంది.

`గ‌బ్బ‌ర్‌సింగ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తరువాత హ‌రీష్ శంక‌ర్‌తో క‌లిసి ప‌వ‌న్ చేసిన సినిమా కావ‌డంతో అభిమానుల్లో స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే భారీ స్థాయిలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్‌తో ర‌న్న‌వుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత ప‌వ‌న్ కల్యాణ్ స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డితో క‌లిసి ఓ భారీ యాక్ష‌న్ డ్రామాని చేయ‌డానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. రామ్ తాళ్లూరి ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు.

ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ఈ మూవీకి ర‌చ‌నా స‌హ‌కారం అందిస్తున్నారు. గ‌త నాలుగేళ్లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్లిబోతోంది. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న సురేంద‌ర్‌రెడ్డి ఈ మూవీతో ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇందులో భాగంగానే ప‌వ‌న్‌కు త‌గ్గ ప‌ర్‌ఫెక్ట్ స్టోరీని రెడీ చేసి ఓకే చెప్పించుకుని ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని వెల్ల‌డించ‌నున్నారు.

ఈ ప్రాజెక్ట్‌తో పాటు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా మరో క్రేజీ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టుగా తెలిసింది. `ప్ర‌స్థానం` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న దేవా క‌ట్టా రీసెంట్‌గా ప‌వ‌న్‌కు ఓ ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ స్టోరీని వినిపించార‌ట‌. స్టోరీ అదిరిపోవ‌డం, స‌మ‌కాలీన రాజ‌కీయాల‌కు అద్దంప‌ట్టేలా ఉండ‌టంతో ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌.

ఇప్ప‌టికే స్క్రిప్ట్‌ని ప‌ర్‌ఫెక్ట్‌గా లాక్ చేసిన దేవా క‌ట్టా ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ భావజాలాన్ని, ఆయ‌న సిద్ధాంతాల‌ని ప్ర‌తిబింబించేలా క్యారెక్ట‌ర్‌ని ప‌వ‌ర్ ఫుల్‌గా డిజైన్ చేశార‌ట‌. గ‌తంలో ప‌వ‌న్ త‌న భావాల‌ని తెర‌పై ఆవిష్క‌రిస్తూ `స‌త్యాగ్ర‌హి` మూవీ చేయాల‌నుకున్నారు. అదే ఫార్ములా స్టోరీతో ప‌క్కాగా ప‌వ‌న్ భావ‌జాలాన్ని ప్ర‌తిభింబిస్తూ దేవా క‌ట్టా ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ని రెడీ చేశాడ‌ట‌. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌పైకి రానున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది.

Tags:    

Similar News